Milk With Anjeer : వర్షాకాలంలో మనం అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటాము. అంటు వ్యాధులు, జ్వరాలు, దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్, వాంతులు, విరోచనాలు ఇలా ఎన్నో రకాల సమస్యల బారిన పడుతూ ఉంటాము. ఎన్నో రకాల క్రిములు, బ్యాక్టీరియాలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మనం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల వైరస్, బ్యాక్టీరియాలు దాడి చేసినప్పటికి మనకు ఎటువంటి హాని కలగదు. మన శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉండాలంటే మనం అంజీరాలను ఆహారంగా తీసుకోవాలి.
అంజీరాలు మనందరికి తెలిసినవే. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే వీటిని చాలా మంది నానబెట్టి తీసుకుంటూ ఉంటారు. కొందరు నేరుగా తింటూ ఉంటారు. కానీ అంజీరాలను పాలతో కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంజీరాలు, పాలు రెండు మన ఆరోగ్యానికి మేలు చేసేవే. వర్షాకాలంలో అంజీరాలను పాలతో కలిపి తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది. అంజీరాలను పాలతో కలిపి తీసుకోవడం వల్ల మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే వీటిలో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అంజీరాలను పాలతో కలిపి తీసుకోవడం వల్ల పైల్స్ సమస్య కూడా తగ్గుతుంది. అలాగే వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి వెంటనే లభిస్తుంది. అలసట, నీరసం, బలహీనత వంటి సమస్యల బారిన పడకుండా ఉంటాము. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. అలాగే అంజీరాలను పాలతో కలిపి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. హార్మోన్ల సమస్యలతో బాధపడే వారు వీటిని కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారు అంజీరాలను, పాలను కలిపి తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే అంజీరాలను పాలనుకలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. చర్మ అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. వృద్దాప్య ఛాయలు దరి చేరకుండా ఉంటాయి. అలాగే నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ అంజీరాలను, పాలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం రోజూ రాత్రి రెండు లేదా మూడు అంజీరాలను నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని మెత్తని పేస్ట్ లా చేసుకుని పాలల్లో వేసి మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న పాలను గ్లాస్ లో పోసుకుని గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఈ విధంగా అంజీరాలను, పాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభించడంతో పాటు అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.