Moringa Leaves And Powder : మున‌గాకులు, వాటి పొడి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఇలా రోజూ తీసుకుంటే ఎన్నో లాభాలు..!

Moringa Leaves And Powder : మున‌గాకులు.. అనేక ఔష‌ధ గుణాలు, పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లిగిన వాటిల్లో ఇది కూడా ఒక‌టి. మున‌గ చెట్టు నుండి వ‌చ్చే మున‌క్కాయ‌ల‌ను మాత్ర‌మే ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మున‌క్కాయ‌లు మాత్ర‌మే మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి అని భావిస్తూ ఉంటారు. కానీ మున‌గాకులు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎంతో కాలంగా వీటిని ఆయుర్వేదంలో ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తూ ఉన్నారు. మున‌గాకును కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకోవ‌చ్చు. మున‌గాకును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మున‌గాకును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మున‌గాకుల్లో క్యాల్షియం, పొటాషియం, ఐర‌న్, జింక్, విట‌మిన్ ఎ, సి, ఇ, బి విట‌మిన్లు ఇలా అనేక ర‌కాల పోష‌కాలు ఉన్నాయి. మున‌గాకును తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. మెద‌డు చురుకుగా పని చేస్తుంది. మెద‌డు సంబంధిత అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే మున‌గాకుల్లో బీటా కెరోటీన్, క్లోరోజెనిక్ యాసిడ్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి శ‌రీరాన్ని ఫ్రీరాడికల్స్ బారి నుండి కాపాడ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ ఆకుల్లో యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు కూడా పుష్క‌లంగా ఉన్నాయి.

Moringa Leaves And Powder many benefits how to take them
Moringa Leaves And Powder

వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో మంట‌, వాపు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ను క‌రిగించ‌డంలో, ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో కూడా మున‌గాకులు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. అదే విధంగా షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు మున‌గాకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల రక్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే మున‌గాకుల్లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. జీర్ణాశ‌య సంబంధిత స‌మ‌స్య‌లు తగ్గుతాయి. అంతేకాకుండా మున‌గాకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా వ‌చ్చే ఇన్పెక్ష‌న్ ల‌బారిన ప‌డ‌కుండా ఉంటాము.

అలాగే క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుండా కాపాడ‌డంలో కూడా మున‌గాకు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగాఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా మున‌గాకు మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. ఈ విధంగా మున‌గాకు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మున‌గాకును మ‌నం అనేక విధాలుగా ఆహారంగా తీసుకోవ‌చ్చు.మున‌గాకుతో ప‌ప్పు, జ్యూస్, స్మూతీ వంటి వాటిని చేసి తీసుకోవ‌చ్చు. అలాగే మున‌గాకు క‌షాయాన్ని తీసుకోవ‌చ్చు. ఈ ఆకుల‌ను పొడిగా చేసి వంట‌ల్లో వేసుకోవ‌చ్చు. ఇలా అనేక విధాలుగా మున‌గాకును మ‌నం ఆహారంగా తీసుకుని చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts