Morning Sunshine : చలికాలంలో చాలా మంది చలి నుండి రక్షించుకోవడానికి ఎండలో నిలబడుతూ ఉంటారు.ఇలా ఎండలో నిల్చోవడం వల్ల చలి నుండి ఉపశమనం కలగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. కేవలం చలికాలంలోనే కాకుండా రోజూ ఎండలో నిలబడాలని ఇది మన రోజులో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎండలో నిలబడడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఎండలో నిలబడడం వల్ల నిద్రపై మనకు మంచి నియంత్రణం వస్తుందని నిద్రను ప్రేరేపించే హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తి చక్కగా ఉంటుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడే వారు రోజూ ఎండలో నిలబడడం అలవాటు చేసుకోవాలి.
దీంతో రాత్రి పూట చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చు. అలాగే సూర్యకాంతి చర్మానికి తగిలేలా నిలబడడం వల్ల శరీరంలో సెరోటోనిన్ ఎక్కువగాఉత్పత్తి అవుతుంది. సెరోటోనిన్ మానసిక స్థితిని మెరుగుపరిచే హార్మోన్. ఎండలో నిలబడడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. మనం రోజంతా ఉల్లాసంగా, ఆనందంగా ఉండవచ్చు. ఉదయం పూట ఎండలో నిలబడితే చాలు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఎల్లప్పుడూ ఒత్తిడికి గురి అయ్యే వారు ఉదయం పూట ఎండలో నిలబడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఎండలో నిలబడడం వల్ల శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ డి లభించడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి.
ఎండలో నిలబడడం వల్ల రోజూ అవసరాలకు తగినంత విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ డి లోపం రాకుండా ఉంటుంది. ఇలా రోజూ ఉదయం ఎండలో నిలబడడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎంత సమయం ఎండలో నిలబడాలే సందేహం మనలో చాలా మందికి కలుగుతుంది. రోజూ 15 నుండి 20 నిమిషాల పాటు ఎండలో నిలబడితే చాలు. అలాగే ఎండ మన శరీరానికి నేరుగా తగిలేలా నిలబడాలి. ఇలా సూర్యరశ్మి తగిలేలా నిలబడడం వల్ల చక్కగా ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.