Mughlai Chicken : రెస్టారెంట్ల‌లో ల‌భించే మొగ‌లాయ్ చికెన్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Mughlai Chicken : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీలల్లో మొగ‌లాయి చికెన్ కూడా ఒక‌టి. ఈ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. నాన్, రోటీ, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో ఈ చికెన్ క‌ర్రీని ఎక్కువ‌గా తింటూ ఉంటారు. ఈ చికెన్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో వెరైటీగా ఇలా మొగ‌లాయి చికెన్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. రెస్టారెంట్ స్టైల్ లో మొగ‌లాయి చికెన్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మొగ‌లాయ్ చికెన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – పావు క‌ప్పు, నూనె – పావు క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – కొద్దిగా, ప‌సుపు – కొద్దిగా, జీల‌క‌ర్ర పొడి – ముప్పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – ముప్పావు టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, అర‌గంట సాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన చికెన్ – అర‌కిలో, నీళ్లు – 400 ఎమ్ ఎల్, పుదీనా త‌రుగు – ఒక టేబుల్ స్పూన్, ప్రెష్ క్రీమ్ – పావు కప్పు, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్.

Mughlai Chicken recipe in telugu make it like restaurant style
Mughlai Chicken

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ్రౌన్ ఆనియ‌న్స్ – ముప్పావు క‌ప్పు, జీడిప‌ప్పు – 15, బాదంప‌ప్పు – 15, మీగ‌డ పెరుగు – అర క‌ప్పు, ప‌చ్చిమిర్చి – 4, ల‌వంగాలు – 4, యాల‌కులు – 2, దాల్చిన చెక్క – అర ఇంచు ముక్క‌, బిర్యానీ ఆకు – 1, మిరియాలు – అర టీ స్పూన్.

మొగ‌లాయ్ చికెన్ త‌యారీ విధానం..

ముందుగా మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు జార్ లో మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ప‌సుపు, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి వేయించాలి. త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి. దీనిని 7 నుండి 8 నిమిషాల పాటు వేయించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌లపాలి. దీనిపై మూత పెట్టి చిన్న మంట‌పై మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ చికెన్ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత పుదీనా, ప్రెష్ క్రీమ్, బ‌ట‌ర్ వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మొగ‌లాయ్ చికెన్ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. త‌రుచూ ఒకేర‌కం చికెన్ క‌ర్రీలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

D

Recent Posts