Mosquito : ప్రస్తుతం మనకు ఎక్కడ చూసినా దోమలు ఎక్కువగా ఉంటున్నాయ. ఎప్పుడు పడితే అప్పుడు కుడుతూ తీవ్ర ఇబ్బందులను కలగజేస్తున్నాయి. దీంతో దోమల బారి నుంచి తప్పించుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. అయితే కింద తెలిపిన విధంగా మొక్కలను పెంచుకోవడం వల్ల దోమలు పారిపోతాయి. దోమల బెడద ఉండదు. మరి ఆ మొక్కలు ఏమిటంటే..
1. దోమలను తరిమేసేందుకు సిట్రనెల్లా అనే మొక్కను పెంచుకోవచ్చు. ఇది ఘాటైన సువాసనను కలిగి ఉంటుంది. కనుక దోమలు పారిపోతాయి. ఇది 5 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. సులభంగా పెంచుకోవచ్చు.
2. లెమన్ బామ్ అనే మొక్కను పెంచుకున్నా దోమలు పారిపోతాయి. ఇది పుదీనా కుటుంబానికి చెందినది. సులభంగా ఇంట్లో పెరుగుతుంది. దీని నుంచి వచ్చే వాసనకు దోమలు పారిపోతాయి.
3. బంతి మొక్కలను చాలా మంది పువ్వుల కోసం ఇంటి పెరట్లో పెంచుతుంటారు. కానీ దీన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల దోమలు పారిపోతాయి. దోమల నుంచి విముక్తి లభిస్తుంది.
4. ఇంట్లో కుండీల్లో వెల్లుల్లి మొక్కలను పెంచుకోవచ్చు. వీటి నుంచి వచ్చే ఘాటు వాసన దోమలకు పడదు. కనుక దోమలు పారిపోతాయి.
5. కుండీల్లో సులభంగా పెరిగే మొక్కల్లో జెరానియం ఒకటి. ఇది నిమ్మచెట్టు వాసన వస్తుంది. ఈ వాసనకు దోమలు రావు. ఇంట్లో ఉండే దోమలు పారిపోతాయి.
6. దోమలను తరిమేసేందుకు మాచిపత్రి మొక్క కూడా అద్బుతంగా పనిచేస్తుంది. దీన్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల దోమలు ఉండవు.