హెల్త్ టిప్స్

సరికొత్త డైట్ వచ్చేసింది.. మీ డీఎన్ఏ చెప్పే డైట్ మీరు ఫాలో అవ్వాలి..!

కట్టే బట్ట చేసే పని హుందాగా ఉంటే చాలనుకునే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. తినే తిండి, పోయే నిద్ర విషయంలో మాత్రం హుందాతనంగా ఉండలేకపోతున్నాం..కొందరికి వేళ కానీ వేళల్లో ఆఫీసులు మరికొందరికి పబ్బులు, పార్టీలు, రెస్టారెంట్లు.. వీటిల్లో ఏదైనా నిద్ర లేమి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. దానితో తిన్నది అరగదు.. వచ్చిన పొట్ట తరగదు.. ఇక అప్పుడు జ్ఞానోదయం అయ్యి అప్పటి వరకూ నడవడానికే బద్ధకించే వారు సైతం పరుగెడతారు. డైటింగ్ అంటూ.. ఆహార విషయంలో ఎన్నో నియమ నిబంధనలు ఫాలో అవుతారు. కానీ ఈ డైటింగుల్లో కూడా చాలా రకాలు. సమస్య ఒకటే అయినా అది రావడానికి వేర్వేరు కారణాలు. దాని నియంత్రణకు వేర్వేరు పద్ధతులు. అయితే వీటిల్లో ఏది ఫాలో అవ్వాలో తెలియని పరిస్థితి. అలాంటి వారి కోసమే.. ఓ సరికొత్త డైట్ వచ్చేసింది.

ఏవోవో డైట్లు ఫాలో అవ్వడం కంటే ‘మీ డీఎన్ఏ చెప్పే డైట్’ ఫాలో అవ్వడం కరెక్ట్ కదా… డీఎన్ఏ డైట్ చెప్పడమేంటి అనుకుంటున్నారా.. నిజమేనండి.. దీనినే “పర్సనల్ న్యూట్రిషన్ డైట్” అంటారు. ప్రస్తుతం నార్వేలో కొనసాగుతుంది. మనిషి డీఎన్ఏ పరీక్షించడం ద్వారా అతనికి ఎటువంటి ఆహారం అవసరం, ఏది తినాలి? ఏది తినకూడదు? ఏ ఆహార లోపం ఉంది? ఎటువంటి ఆహారం అధికంగా ఉంది? వంటి అనేకానేక విషయాలను తెలుసుకోవచ్చు. మనం కూడా ఈ డైట్ ఫాలో అవ్వాలి అంటే కావాల్సిన వారు తమ లాలాజలాన్ని నార్వే లేదా భారత్ డీఎన్ఏ సెంటర్లకు పంపిస్తే సరిపోతుంది. వారు దానిని పరిరక్షించి మీ డీఎన్ఏని బట్టి ఓ నివేదిక తయారు చేస్తారు. శరీరంలో ఉన్న పదార్ధాల హెచ్చుతగ్గుల శాతాన్ని వివరిస్తూ తద్వారా రాబోయే వ్యాధుల గురించి కూడా తెలుపుతారు.

new type of diet available follow this according to dna

అసలు ఈ డైట్ ఎంత వరకూ అవసరం అనే విషయం గురించి ప్రస్తావిస్తే శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు ఇవి. మానవ శరీరంలో సుమారు 5లక్షల కోట్ల బాక్టీరియా ఉందట. తిన్న ఆహారంలో అధిక మొత్తం ఆ బాక్టీరియాకే పోతుందంట. దీనితో శరీరానికి అందాల్సిన ఆహారం అందకుండా పోతుంది. ఈ సమస్యని పరిష్కారించాలంటే పర్సనల్ న్యూట్రిషన్ డైట్ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల ఎటువంటి మెడిసిన్ వాడకుండానే శరీరాన్ని ఇబ్బంది పెట్టే బాక్టీరియాని, వాటి వల్ల శరీరానికి ఏ మాత్రం ఉపయోగం లేని బాక్టీరియాని చంపేయొచ్చు.

తమ పౌరుల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించే బ్రిటన్ ప్రభుత్వం ఇదే దిశగా మరో కొత్త నిర్ణయం తీసుకుంది. హాస్పిటల్ కి వెళ్లే ప్రతి రోగి డీఎన్ఏ సేకరించి, పరీక్షించి ఆ డేటాను భద్రపరచాల్సిందిగా హాస్పిటల్ యాజమాన్యాలకు పిలుపునిచ్చింది. సేకరించిన డేటాను పరిశీలించి ఓ సమగ్ర నివేదిక అందించే బాధ్యతను ‘జాతీయ ఆరోగ్య సేవల ప్రాజెక్ట్’ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. బ్రిటన్ ప్రభుత్వం చూపిన ఈ చొరవ మిగతా దేశాలల్లో కూడా అమలు జరిగితే ముఖ్యంగా మన భారతదేశంలో అమలు జరిగితే చాలా వరకూ ప్రాణ నష్టాన్ని అరికట్టవచ్చు.

Admin

Recent Posts