Pepper For Brain : బ్రెయిన్‌కు అతి ముఖ్య‌మైన‌ది ఇది.. లైఫ్‌లో మ‌తిమ‌రుపు రాదు..!

Pepper For Brain : మ‌న మెద‌డు క‌ణాల ఆయుర్ధాయం 150 సంవ‌త్స‌రాలు. గర్భంలో ఉన్న‌ప్పుడే మెద‌డు క‌ణాల నిర్మాణం ప్రారంభ‌మ‌వుతుంది. మొద‌టి 2 నుండి 3 సంవ‌త్సరాల వ‌య‌సులో మెద‌డు అభివృద్ది ఎక్కువ‌గా జ‌రుగుతుంది. అందుకే పిల్ల‌ల‌కు శ‌రీరం చిన్న‌గా ఉన్న‌ప్ప‌టికి త‌ల పెద్ద‌గా ఉంటుంది. అలాగే మెద‌డు క‌ణాలు ఒక్క‌సారి పుట్టాయంటే మ‌నం మ‌ర‌ణించే వ‌ర‌కు అవే క‌ణాలు ఉంటాయి. మెద‌డు క‌ణాలు ఒక్క‌సారి మ‌ర‌ణిస్తే మ‌ర‌లా పుట్ట‌డం జ‌ర‌గ‌దు. మెద‌డు క‌ణాలు మ‌ర‌ణించే కొద్ది వాటి సంఖ్య త‌గ్గుతూ ఉంటుంది. క‌నుక మ‌నం మెద‌డు క‌ణాలు చ‌నిపోకుండా, వాటిలో ఇన్ ప్లామేష‌న్ రాకుండా చూసుకోవాలి. మెద‌డు క‌ణాలు క‌నుక చ‌నిపోతే మ‌న మెద‌డు ఎంతో న‌ష్టం క‌లుగుతుంది. క‌నుక ఈ ప్ర‌క్రియ మ‌న‌లో జ‌ర‌గ‌కుండా చూసుకోవాలి. మెద‌డులో కొన్ని ర‌కాల హానికార‌క ప్రోటీన్ లు విడుద‌లై మెద‌డు క‌ణాల‌ను న‌శింప‌జేస్తూ ఉంటాయి.

మెద‌డులో టార్, బీటాఆమిలాయిడ్ వంటి ప్రోటీన్ లు మెద‌డు క‌ణాల‌ను, మెద‌డు ఆరోగ్యాన్ని న‌శింప‌జేస్తూ ఉంటాయి. ఇటువంటి ప్రోటీన్ లు మెద‌డు క‌ణాల‌ను న‌శింప‌జేయ‌కుండా కాపాడ‌డంలో మిరియాలు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. మిరియాల్లోఉండే పెప్ప‌రిన్ మెద‌డు క‌ణాల‌ను నాశ‌నం చేసే ప్రోటీన్ ను న‌శింప‌జేసి మెద‌డు ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో స‌హాయ‌ప‌డుతుందని వారు చెబుతున్నారు. మిరియాల‌ను వాడ‌డం వ‌ల్ల వ‌య‌సు పెరిగే కొద్ది వ‌చ్చే మ‌తిమ‌రుపు, డిమెన్షియా వంటివి రాకుండా ఉంటాయి. మిరియాల‌ను వాడ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న విష‌యం మ‌నంద‌రికి తెలుసు. కానీ ఈ విధంగా మిరియాలు మ‌న మెద‌డు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయ‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు.

Pepper For Brain take daily for many benefits
Pepper For Brain

నేటి త‌రుణంలో చాలా మంది వ‌య‌సు పైబ‌డే కొద్ది మ‌తిమ‌రుపు, అల్జీమ‌ర్స్ వంటి మెద‌డు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇటువంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు అలాగే ఇటువంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉండాల‌నుకునే వారు మిరియాలను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. మిరియాల‌ను వాడ‌డం వ‌ల్ల చ‌నిపోయిన క‌ణాలు మ‌ర‌లా తిరిగి రాన‌ప్ప‌టికి ఉన్న క‌ణాలు దెబ్బ‌తిన‌కుండా ఉంటాయి. వంట‌ల్లో కారానికి బ‌దులుగా మిరియాల‌ను వాడ‌డం అలాగే స‌లాడ్స్, సూప్స్, మొల‌కెత్తిన గింజ‌లు వంటి వాటిలో మిరియాల పొడిని వాడ‌డం వ‌ల్ల మెద‌డు క‌ణాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts