Pomegranate At Night : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో దానిమ్మపండ్లు కూడా ఒకటి. చాలా మంది ఇండ్లల్లో దానిమ్మ చెట్లను పెంచుకుంటూ ఉంటారు. అలాగే దానిమ్మకాయలు మనకు బయట మార్కెట్ లో విరివిరిగా లభిస్తూ ఉంటాయి. దాదాపు సంవత్సరం పొడవునా ఈ పండ్లు మనకు లభిస్తూ ఉంటాయి. దానిమ్మగింజలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. కొందరు దానిమ్మ గింజలను తింటే కొందరు వాటితో జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు. దానిమ్మపండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి.
దానిమ్మ గింజలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అలాగే వీటిలో ఉండే పోషకాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మగింజల్లో ఫైబర్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక రకాల పోషకాలు ఉంటాయి. దానిమ్మ గింజలను తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ గింజలను జ్యూస్ గా చేసి తీసుకుంటే మాత్రం వీటిలో ఉండే ఫైబర్ మన శరీరానికి అందదు.
అలాగే దానిమ్మ పండును తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. రాత్రి సమయంలో దానిమ్మగింజలను తీసుకోవడం వల్ల మనకు మరింత మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ లో ఒక టీ స్పూన్ అల్లం రసం వేసి కలపాలి. ఈ జ్యూస్ ను రాత్రి పూట పడుకోవడానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే ఒక కప్పు దానిమ్మ గింజలల్లో పెరుగు కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గి హాయిగా నిద్ర పడుతుంది.
అంతేకాకుండా దానిమ్మ గింజలను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలోరోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారు, సంతానలేమి సమస్యలతో బాధపడే వారు దానిమ్మ గింజలను తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఈ విధంగా దానిమ్మ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రతి ఒక్కరు వీటిని తప్పకుండా తమ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.