హెల్త్ టిప్స్

గ‌ర్భిణీలు నిద్ర స‌రిగ్గా ప‌ట్టాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

గర్భధారణ సమయంలో మహిళలకు నిజంగా ప్రతి రోజు ఒక సవాలుగా ఉంటుంది. అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అంతే కాకుండా గర్భధారణ సమయం లో మహిళలు మంచి నిద్రను పొందలేకపోతూ ఉంటారు. పిండం పెరిగే కొద్దీ గర్భిణిలు తక్కువగా నిద్రపోతూ ఉంటారు. సరైన నిద్ర పట్టాలంటే కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అలా చేస్తే మంచి నిద్రను పొందగలరు. లేదంటే నిద్రపట్టకపోవడం కీలక సమస్యగా మారిపోతుంది. గర్భవతిగా ఉన్నప్పుడు కాళ్లు తిమ్మిరి ఎక్కడం కూడా సహజము. కొందరి కాళ్ళు వాపుగా కూడా కనిపిస్తాయి. ఇలా తిమ్మిరి ఎక్కడం వల్ల కూడా నిద్రకి భంగం కలుగుతుంది.

అంతే కాకుండా తరచూ మూత్ర విసర్జన సమస్య కూడా ఉంటుంది. చివరి దశకు చేరిన కొద్ది ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా మానసిక ఒత్తిడి కూడా వారి మీద పడడంతో టీ, కాఫీ అలవాటు కూడా ఎక్కువ అవుతుంది. దీని వల్ల కూడా సమస్య తలెత్తవచ్చు. కాబట్టి వీలైనంత వరకు టీ, కాఫీలకు దూరంగా ఉండటం మంచిది. అలానే ఆహారం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. అలాంటప్పుడు ఎక్కువ సార్లు కొంచెం కొంచెం తిన్నా పర్వాలేదు. ఏది ఏమైనా హార్మోన్ల ప్రభావం మానసిక ఒత్తిడి కారణంగా రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర పొందలేరు. కనుక గర్భిణీలు సరిగ్గా నిద్రపోవాలంటే పడుకునే ముందు వేడి పాలను తాగడం అలవాటు చేసుకోండి.

pregnant women follow these tips to get good sleep

ఆరోగ్యం కూడా దీనివల్ల మెరుగుపడుతుంది. వీలైనంత వరకు పిండిపదార్థాల‌కి దూరంగా ఉండండి. రోజువారీ ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఉండేలా చూసుకోవడం మంచిది. రాత్రి పూట పండ్లు, లైట్ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. గర్భ సమయంలో పిల్లలకు నీరు చాలా అవసరం. బిడ్డకు కావల్సిన ఎనర్జీని కూడా ద్ర‌వ రూపం లోనే చేరుతుంది. ఒత్తిడి తగ్గించుకునేందుకు తేలికపాటి యోగాసనాలు కూడా చేయడం మంచిది. దీనివల్ల మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది. రోజూ గోరు వెచ్చని స్నానం చేయడం ప్రశాంతంగా ఉండటం వల్ల కూడా హాయిగా నిద్ర పడుతుందని నిపుణులు అంటున్నారు.

Admin

Recent Posts