Pumpkin Seeds For Brain : వీటిని రోజూ తింటే చాలు.. మీ మెద‌డు చిట్టి రోబో క‌న్నా వేగంగా ప‌నిచేస్తుంది..!

Pumpkin Seeds For Brain : మ‌న‌లో చాలా మంది జ్ఞాప‌క‌శ‌క్తి, మేధాశ‌క్తి, చ‌క్క‌టి ఆలోచ‌నా శ‌క్తి ఉండాల‌ని కోరుకుంటారు. ఏదైనా విన్న వెంట‌నే ఎప్పటికి అలా గుర్తుండి పోవాల‌ని కోరుకుంటారు. మెద‌డు ఈ విధంగా చ‌క్క‌టి ఆలోచ‌నా శ‌క్తితో ప‌ని చేయాలంటే మ‌నకు జింక్ ఎంతో అవ‌స‌ర‌మవుతుంది. శ‌రీరానికి త‌గినంత జింక్ అంద‌డం వ‌ల్ల మేధాశ‌క్తి చ‌క్క‌గా ప‌ని చేస్తుందని జింక్ లోపిస్తే మేధాశ‌క్తి త‌గ్గుతుంద‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా కూడా నిరూపించారు. జింక్ లోపించడం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు త‌గ్గుతుంద‌ని మేధాశ‌క్తి కూడా త‌గ్గుతుంద‌ని మ‌తిమ‌రుపు ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని అమెరికా దేశ శాస్త్ర‌వేత్త‌లు జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

జింక్ లోపించ‌డం వ‌ల్ల పిల్లలు ఎక్కువ‌గా హైప‌ర్ యాక్టివ్ గా ఉంటున్నార‌ని, వారిలో ఆలోచ‌నా శ‌క్తి త‌గ్గిపోతుంద‌ని అలాగే వారిలో మాన‌సికప‌ర‌మైన స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని, వారికి చ‌దువు మీద ఆస‌క్తి త‌గ్గిపోతుంద‌ని కూడా నిపుణులు చెబుతున్నారు. శ‌రీరంలో జింక్ లోపించ‌డం వ‌ల్ల మెద‌డు క‌ణాల్లో ప్రోటీన్ చైన్స్ ఎక్కువ‌గా దెబ్బ‌తింటాయని దీంతో మెద‌డు క‌ణాలు దెబ్బ‌తిని మ‌తిమ‌రుపు వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే బాలింత‌లల్లో క‌నుక జింక్ లోపం ఉంటే వారి పాలు తాగిన పిల్ల‌లకి కూడా మాన‌సిక ప‌ర‌మైన స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

Pumpkin Seeds For Brain take daily to get many benefits
Pumpkin Seeds For Brain

క‌నుక గ‌ర్భిణీ స్త్రీలు, బాలింతలు జింక్ ఎక్కువగా ఉండే ఆహారాల‌ను కూడా తీసుకోవ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని వారు చెబుతున్నారు. మ‌న శ‌రీరానికి రోజుకు 8 మిల్లీ గ్రాముల జింక్ అవ‌స‌ర‌మ‌వుతుంది. మ‌నం తీసుకునే ఆహారాల్లో జింక్ ఉన్నప్పటికి అన్నింట్లో కూడా చాలా త‌క్కువ మోతాదులో ఉంటుంది. జింక్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో గుమ్మ‌డి గింజ‌లు ఒక‌టి. 100గ్రాముల గుమ్మ‌డి గింజ‌ల్లో 7.7 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది. గుమ్మ‌డి గింజ‌ల్లో ఇత‌ర పోష‌కాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. మాంసం, చికెన్ కంటే వీటిలో శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే ఇవి మ‌న‌కు త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తాయి. మెద‌డు చురుకుగా ప‌ని చేయాల‌నుకునే వారు, మేధాశ‌క్తి, ఆలోచ‌నా శ‌క్తి పెర‌గాల‌నుకునే వారు గుమ్మ‌డి గింజ‌ల‌ను తీసుకోవ‌డం వల్ల త‌గినంత జింక్ ల‌భిస్తుంది.

దీంతో మెద‌డు చురుకుగా పని చేస్తుంది. చ‌దువుకునే పిల్ల‌ల‌కు గుమ్మ‌డి గింజ‌ల‌ను ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. ఆలోచ‌నా శ‌క్తి పెరుగుతుంది. పిల్ల‌ల‌కు గుమ్మ‌డి గింజ‌ల‌ను ఇవ్వ‌డం వల్ల తెలివితేట‌లు పెర‌గ‌డంతో పాటు వారిలో ఎదుగుద‌ల కూడా చ‌క్క‌గా ఉంటుంది. మెద‌డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ గుమ్మ‌డి గింజ‌ల‌ను నాన‌బెట్టి తీసుకోవ‌చ్చు. అలాగే వీటితో కారం పొడి తయారు చేసి నిల్వ చేసుకుని తీసుకోవ‌చ్చు. అంతేకాకుండా వీటిని వేయించి ల‌డ్డూలుగా త‌యారు చేసుకుని కూడా తీసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts