Raisins With Milk : నీరసం, బలహీనత, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇలా ఏదో ఒక సమస్యతో ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉన్నారు. వృద్ధాప్యంలో రావాల్సిన అనారోగ్య సమస్యలన్నీ నేటి తరుణంలో ముందుగానే వచ్చేస్తున్నాయి. ఇటువంటి అనారోగ్య సమస్యలు రావడానికి ప్రధాన కారణం పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడమే. జంఖ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడిన నేటి తరుణం వారు పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడమే మానేసారు. దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటువంటి సమస్యలన్నింటిని ప్రారంభ దశలో ఉన్నప్పుడే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి లేదంటే అవి తీవ్ర అనారోగ్యానికి దారి తీసే అవకాశం ఉంది.
నీరసం, బలహీనత, క్యాల్షియం లోపం, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడే వారు ఎండు నల్ల ద్రాక్షను ఈ విధంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎండు నల్ల ద్రాక్షలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం పోషకాహార లోపాన్ని చాలా సులభంగా అధిగమించవచ్చు. ఒక గిన్నెలో గ్లాస్ పాలను తీసుకుని వేడి చేయాలి. పాలు కాగిన తరువాత అందులో 10 ఎండు నల్ల ద్రాక్షలను, రెండు టేబుల్ స్పూన్ల వాల్ నట్స్ పలుకులను వేసి మరిగించాలి. తరువాత ఈ పాలను గ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. అలాగే ఎండు ద్రాక్షను, వాల్ నట్స్ ను తినాలి. ఈ పాలను ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా తీసుకోవచ్చు.
అయితే వీటిని తీసుకోవడానికి ముందు, తీసుకున్న తరువాత అరగంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ విధంగా పాలను తయారు చేసి తీసుకోవడం వల్ల నీరసం, బలహీనత తగ్గుతుంది. శరీరానికి తగినంత క్యాల్షియం లభిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెదడు పని తీరు పెరుగుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. కంటికి సంబంధించిన సమస్యలు తలెత్తకుండాఉంటాయి. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఈ విధంగా పాలను తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
అయితే బరువు తగ్గాలనుకునే వారు ఇందులో కొవ్వు లేని పాలను ఉపయోగించాలి. బరువు పెరగాలనుకునే వారు కొవ్వు ఉన్న పాలను ఉపయోగించవచ్చు. ఈ పదార్థాలన్నీ సహజ సిద్దమైనవే అలాగే మనకు విరివిరిగా లభిస్తాయి. వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ విధంగా పాలతో వాల్ నట్స్ ను, ఎండుద్రాక్షను కలిపి తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.