Raw Coconut For IQ : దీన్ని త‌ర‌చూ తింటే చాలు.. తెలివితేట‌లు అమోఘంగా పెరుగుతాయి..

Raw Coconut For IQ : పిల్ల‌ల మేధాశ‌క్తి, తెలివితేట‌లు పెర‌గాల‌ని త‌ల్లిదండ్రులు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. వారికి పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను ఇవ్వ‌డంతో పాటు బ‌య‌ట మార్కెట్ లో దొరికే ర‌క‌ర‌కాల పొడుల‌ను కూడా పాల‌ల్లో క‌లిపి ఇస్తూ ఉంటారు. వీటికి బ‌దులుగా స‌హ‌జ సిద్దంగా ల‌భించే ప‌చ్చి కొబ్బ‌రిని ఇవ్వ‌డం వ‌ల్ల పిల్ల‌ల్లో మేధాశ‌క్తి బాగా పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ప‌చ్చి కొబ్బ‌రిలో శ‌రీరానికి మేలు చేసే ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయ‌ని మెద‌డు అభివృద్ధికి ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మ‌హ‌ర్షులు ఏనాడో క‌నుగొన్నారు. అందుకే ప‌చ్చి కొబ్బ‌రికి మ‌న ఆచారాల్లో ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చారు. కొబ్బ‌రి తెలివితేటలు పెర‌గ‌డానికి, జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గ‌డానికి, మెద‌డు అభివృద్ది చెంద‌డానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. పిల్ల‌ల‌కు కొబ్బ‌రిని ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంద‌ని శాస్త్రీయంగా కూడా నిరూపిత‌మైన‌ది.

ప‌చ్చి కొబ్బ‌రిని తింటే ద‌గ్గు వ‌స్తుంద‌ని చాలా మంది పిల్ల‌ల‌కు దీనిని ఆహారంగా ఇవ్వ‌రు. కానీ పిల్ల‌ల‌కు ప‌చ్చి కొబ్బ‌రిని ఆహారంగా ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో తెలివితేట‌లు పెంచిన వాళ్లం అవుతామ‌ని నిపుణులు చెబుతున్నారు. ఒక క‌ప్పు కొబ్బ‌రి తురుములో 3 లేదా 4 టీ స్పూన‌ల్ చెరుకు పాన‌కాన్ని వేసి ఇవ్వాలి. చెరుకు పానకాన్ని మ‌నం ఇంట్లో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఒక‌టి లేదా రెండు లీట‌ర్ల చెరుకు ర‌సాన్ని క‌ళాయిలో తీసుకుని వేడి చేయాలి. దీనిని అర‌గంట పాటు ఉడికించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న చెరుకు పాన‌కాన్ని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌చ్చు. ఇలా త‌యారు చేసుకున్న చెరుకు పానకం, కొబ్బ‌రి తురుము క‌లిపిన ఈ మిశ్ర‌మం చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా కొబ్బ‌రి తురుమును తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు, క‌ఫం వంటి స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి.

Raw Coconut For IQ take regularly for better effect
Raw Coconut For IQ

పిల్ల‌ల‌కు ఈ విధంగా కొబ్బ‌రి తురుమును రోజూ అల్పారంలో భాగం చేయాలి. మాంసం కంటే కూడా కొబ్బ‌రి తురుము 10 రెట్లు ఎక్కువ బ‌లాన్ని ఇస్తుంది. ఇలా వారినికి కొన్ని నెల‌ల పాటు ఇవ్వ‌డం వ‌ల్ల పిల్ల‌ల్లో వ‌చ్చిన మార్పును మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. కొబ్బ‌రి తురుమును ఇవ్వ‌డం వ‌ల్ల పిల్ల‌ల ఆలోచ‌నా విధానంలో, చ‌ద‌వ‌డంలో, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుద‌ల‌లో, నిర్ణ‌యాలు తీసుకునే విధానంలో ఇలా అన్నీ ర‌కాలుగా వారిలో మార్పు వ‌స్తుందని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. ఫ్రిజ‌ర్వేటివ్స్, రంగులు, వివిధ ర‌కాల ప్లేవ‌ర్స్ క‌లిపిన పొడుల‌ను ఇవ్వ‌డం కంటే స‌హ‌జ సిద్దంగా ల‌భించే ఈ ప‌చ్చి కొబ్బ‌రిని ఇవ్వ‌డం వ‌ల్ల పిల్ల‌ల మేధాశ‌క్తితో పాటు ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts