వర్షాకాలంలో దోమలు కుట్టడం వల్ల అనేక వ్యాధులు వస్తుంటాయి. వాటిల్లో డెంగ్యూ ఒకటి. ఈ వ్యాధి బారిన పడితే తీవ్రమైన జ్వరం వస్తుంది. ఒళ్లు నొప్పులు ఉంటాయి. అసలు లేచి నిలబడేందుకే శక్తి చాలనట్లు అనిపిస్తుంది. డెంగ్యూ జ్వరానికి కచ్చితమైన మందులు అంటూ ఏమీ లేవు. వైద్యులు యాంటీ బయోటిక్స్ వాడుతూ, ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుతూ చికిత్స చేస్తారు. అయితే డెంగ్యూ వచ్చి తగ్గాక కోలుకుంటున్న సమయంలో కింద తెలిపిన ఆహారాలను తీసుకుంటుండాలి. దీంతో ఆ వ్యాధి నుంచి త్వరగా రికవరీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
1. డెంగ్యూ వచ్చిన వారికి ప్లేట్ లెట్ల సంఖ్య బాగా పడిపోతుంది. అలాంటి వారు రోజూ ఉదయం, సాయంత్రం పావు టీస్పూన్ మోతాదులో బొప్పాయి చెట్టు ఆకుల రసాన్ని తాగుతుండాలి. దీంతో ప్లేట్ లెట్ల సంఖ్య పెరుగుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు.
2. కొబ్బరినీళ్లలో ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అందువల్ల వాటిని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. కొబ్బరినీళ్లను తాగితే శరీరంలో ఎలక్ట్రోలైట్ల స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అందువల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవచ్చు. శరీరానికి శక్తి లభిస్తుంది. నీరసం తగ్గుతుంది. కాబట్టి డెంగ్యూ వచ్చి కోలుకుంటున్నవారు కచ్చితంగా రోజుకు 2 గ్లాసుల కొబ్బరి నీళ్లను తాగుతుండాలి. దీంతో త్వరగా కోలుకుంటారు.
3. డెంగ్యూ నుంచి కోలుకుంటున్నవారు పండ్ల రసాలను ఎక్కువగా తాగాలి. దీంతో శరీరం పోషకాలను సరిగ్గా గ్రహిస్తుంది. నీరసం తగ్గుతుంది. పండ్లలో అనేక విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంఇ. కనుక పండ్ల రసాలను తాగుతుంటే డెంగ్యూ నుంచి త్వరగా కోలుకుంటారు.
4. యాలకులు, పెప్పర్‌మింట్, అల్లం, దాల్చిన చెక్క వంటి పదార్థాలతో తయారు చేసే టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవచ్చు.
5. రాగులు, సజ్జలు లేదా జొన్నలు, ఓట్స్ వంటి వాటిని పాలలో వేసి ఉడికించి తీసుకుంటాండాలి. దీంతో శరీరానికి పోషకాలు, శక్తి లభిస్తాయి. డెంగ్యూ నుంచి త్వరగా కోలుకుంటారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365