టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డ్డ‌వారికి షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించే ఇంటి చిట్కాలు..!

టైప్ 2 డ‌యాబెటిస్.. ప్ర‌పంచ వ్యాప్తంగా చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది దీని బారిన ప‌డుతున్నారు. యుక్త వ‌య‌స్సులోనే కొంద‌రికి టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే టైప్ 2 డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవ‌డం తేలికే. రోజూ స‌మ‌యానికి భోజ‌నం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌డం వంటివి చేస్తే టైప్ 2 డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది. అంతేకాదు, కింద తెలిపిన చిట్కాల‌ను పాటించడం వల్ల కూడా టైప్ 2 డ‌యాబెటిస్‌ను అదుపులోకి తేవ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే..

home remedies for type 2 diabetes

1. రెండు టీస్పూన్ల మెంతుల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ప‌ర‌గడుపునే ఆ నీటిని తాగి ఆ మెంతుల‌ను తినాలి. ఇలా రోజూ చేస్తుంటే ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. టైప్ 2 డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

2. షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించేందుకు కాక‌ర‌కాయ‌లు ఎంతో బాగా ప‌నిచేస్తాయి. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 30 ఎంఎల్ మోతాదులో కాక‌ర‌కాయ ర‌సాన్ని తాగుతుండాలి. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది.

3. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని క‌లిపి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గడుపునే తాగుతుండాలి. దీని వ‌ల్ల కూడా షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

4. విట‌మిన్ సి అధికంగా ఉండే నిమ్మ‌, నారింజ వంటి పండ్ల‌ను రోజూ తీసుకోవాలి. ఇవి బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గిస్తాయి. రోజూ 600 మిల్లీగ్రాముల మోతాదులో విట‌మిన్ సి అందేలా చూసుకోవాలి. దీంతో డ‌యాబెటిస్‌ను అదుపు చేయ‌వ‌చ్చు.

5. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 30 ఎంఎల్ మోతాదులో క‌ల‌బంద ర‌సాన్ని తీసుకోవాలి. షుగ‌ర్‌ను త‌గ్గిస్తుంది.

6. ఉసిరికాయ‌ల్లో విట‌మిన్ సి, క్రోమియం ఉంటాయి. ఇవి షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గిస్తాయి. అందువ‌ల్ల రోజూ ప‌ర‌గ‌డుపునే 30 ఎంఎల్ మోతాదులో ఉసిరికాయ జ్యూస్‌ను తాగుతుండాలి.

7. షుగ‌ర్ ను త‌గ్గించ‌డంలో మున‌గ ఆకులు బాగా ప‌నిచేస్తాయి. రోజూ రెండు సార్లు మున‌గ ఆకుల‌ను నీటిలో మ‌రిగించి ఆ నీటిని కప్పు మోతాదులో తాగుతుండాలి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts