Roasted Black Chana : సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది ఏ స్నాక్స్ తిందామా.. అని తెగ ఆలోచిస్తుంటారు. అందులో భాగంగానే జంక్ ఫుడ్ ఎక్కువగా తింటుంటారు. ముఖ్యంగా నూనె పదార్థాలు, బేకరీ ఆహారాలను అధికంగా తింటారు. కానీ ఇవి మన ఆరోగ్యానికి చేటు చేస్తాయి. కనుక వీటికి బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తినాల్సి ఉంటుంది. ఇవి మనకు రుచితోపాటు పోషకాలను, శక్తిని కూడా అందిస్తాయి. కనుక ఆరోగ్యకరమైన స్నాక్స్‌నే రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాంటి స్నాక్స్‌లో వేయించిన నల్ల శనగలు కూడా ఒకటి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని రోజూ స్నాక్స్ రూపంలో తినడం వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు. శనగలను తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల శనగలను కళాయిలో వేసి బాగా వేయించాలి. అవసరం అనుకుంటే రుచి కోసం కాస్త ఉప్పు, కారం కలుపుకోవచ్చు. ఇక ఇలా చేసిన శనగలను రోజూ ఒక కప్పు మోతాదులో తినాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. ఈ శనగలను తినడం వల్ల ఫైబర్ పుష్కలంగా అందుతుంది. ఇది షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, మలబద్దకం తగ్గుతాయి. దీంతోపాటు కొవ్వు కూడా కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. కనుక వేయించిన నల్ల శనగలను స్నాక్స్ రూపంలో తినాలి.
ఇక ఈ శనగలను తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. రక్తనాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్‌లు రావు. గుండె పనితీరు మెరుగు పడుతుంది. ఈ శనగల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. అయితే నల్ల శనగలను ఇలా వేయించి తినడం ఆరోగ్యకరమే అయినప్పటికీ వీటిని మోతాదుకు మించి తినరాదు. తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు డాక్టర్ సూచన మేరకు వీటిని తినవచ్చు. ఇక బీపీ ఉన్నవారు ఉప్పు లేకుండా వీటిని వేయించుకుని తినాలి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.