Roasted Chana : వేయించిన శ‌న‌గ‌ల‌ను రోజూ తినాలి.. ఎందుకో తెలిస్తే వెంట‌నే తిన‌డం మొద‌లు పెడ‌తారు..!

Roasted Chana : శ‌న‌గ‌ల‌తో పాటు మ‌నం కాల్చిన శ‌న‌గ‌లు అన‌గా పుట్నాల ప‌ప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పుట్నాల ప‌ప్పుతో ర‌క‌ర‌కాల చిరుతిళ్లు, అల్పాహారాల్లోకి చ‌ట్నీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. పుట్నాల ప‌ప్పుతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని చాలా మంది ఇష్టంగా కూడా తింటూ ఉంటారు. ఇక పుట్నాల ప‌ప్పును అలాగే వీటితో చేసిన వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిని మితంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని వారు చెబుతున్నారు. పుట్నాల పప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పుట్నాల ప‌ప్పులో ప్రోటీన్ ఎక్కువ‌గా ఉంటుంది.

వీటిని చిరుతిండి రూపంలో తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్ లో ఎంతో కొంత అందించ‌వ‌చ్చు. అలాగే దీనిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కడుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఇవి చ‌క్క‌గా ప‌నిచేస్తాయి. అలాగే వీటిలో కొవ్వు కూడా త‌క్కువ‌గా ఉంటుంది. స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అదే విధంగా పుట్నాల ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భిస్తుంది. మ‌నం రోజంతా నీర‌సానికి గురి కాకుండా చ‌క్క‌గా ప‌ని చేసుకోవ‌చ్చు. అలాగే పుట్నాల పప్పులో ఫోలేట్, ఐర‌న్, ఫాస్ప‌ర‌స్, మాంగ‌నీస్ వంటి మిన‌రల్స్, విట‌మిన్స్ ఎక్కువ‌గా ఉంటాయి.

Roasted Chana many wonderful health benefits take daily
Roasted Chana

వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్స్,మిన‌ర‌ల్స్ చ‌క్క‌గా అందుతాయి. అలాగే పుట్నాల ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. అలాగే వీటిలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో సహాయ‌ప‌డ‌తాయి. ఈ విధంగా పుట్నాల ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వీటికి ఇత‌ర మ‌సాలాలు క‌లిపి మ‌రింత రుచిగా త‌యారు చేసుకుని చిరుతిండి రూపంలో తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు పోష‌కాల‌ను, చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Share
D

Recent Posts