Samalu : ఒకప్పుడు చిరుధాన్యాలు మాత్రమే ఆహారంగా ఉండేవి. వీటిని తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేవారు. కానీ మారుతున్న కాలానుగుణంగా మన ఆహారపు అలవాట్లు కూడా మారాయి. దీంతో చిరు ధాన్యాల వాడకం తగ్గిపోయింది. చిరు ధాన్యాలకు బదులుగా బియ్యంతో వండిన అనాన్ని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటున్నారు. అలాగే అనేక రకాల చిరుతిళ్లను, జంక్ ఫుడ్ ను ఆహారంగా తీసుకుంటున్నారు. దీంతో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి.
ఈ సమస్యల నుండి బయటపడాలంటే మరలా చిరుధాన్యాలనే ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ప్రస్తుత కాలంలో చిరుధాన్యాల వాడకం ఎక్కువైందనే చెప్పవచ్చు. మనం ఆహారంగా తీసుకోదగిన అలాగే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరుధాన్యాల్లో సామలు కూడా ఒకటి. సామలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. సామల్లో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, ప్రోటీన్, జింక్, ఐరన్, ఫాస్పరస్ ఇలా అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
సామలను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే వీటిని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. సామలల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక ఇవి జీర్ణమవ్వడానికి సమయం ఎక్కువగా పడుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు సామలను వండుకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలగే సామలను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే అధిక బరువుతో బాధపడే వారు సామలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.
అంతేకాకుండా సామలను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరం బలంగా, ధృడంగా తయారవుతుంది. నీరసం, బలహీనత వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. రోజంతా ఉత్సాహంగాఉండవచ్చు. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఈ విధంగా సామలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో దోశలు, అన్నం, ఉప్మా, ఇడ్లీ, టిక్కి, పులావ్ వంటి వాటిని వండుకుని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.