Sleep : ప్రస్తుత కాలంలో వయస్సుతో, వృత్తి, వ్యాపారాలతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్య మానసిక ఆందోళన. ఈ సమస్య రావడానికి కారణం మన మెదడులో ఆలోచనలు ఎక్కువగా రావడం. ఈ ఆలోచనలను నియంత్రించే శక్తి మన మనస్సుకు లేకపోవడంతో ఆలోచనలు ఎక్కవయ్యి మానసికంగా ఆందోళనకు గురి అవుతాము. దీని వల్ల మన శరీరానికి ఎంతో హాని కలుగుతుంది. షుగర్, బీపీ, హార్మోన్ల అసమతుల్యత, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.
మానసిక ఆందోళన కారణంగా మొదటగా వచ్చే సమస్య నిద్రలేమి. మన మెదడులో అధికంగా ఉండే ఆలోచనల కారణంగా మనం ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. ఎటువంటి మందులు వాడకుండా మనం తీసుకునే ఆహారం ద్వారా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. మనకు వచ్చే ఆలోచనలను తగ్గించి, పడుకోగానే నిద్రలోకి జారుకునేలా చేసే కూరగాయ ఒకటి ఉంది. ఆ కూరగాయే పొట్ల కాయ. దీని నుండి వచ్చే వాసన, రుచి కారణంగా పొట్లకాయను చాలా మంది ఇష్టపడరు. కానీ పొట్లకాయ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. జబ్బు చేసి తగ్గిన వారు ఆహారంలో భాగంగా పొట్లకాయను తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య ఉండదు.
పొట్ల కాయలో 96 శాతం నీరే ఉంటుంది. అది త్వరగా జీర్ణమవుతుంది. జబ్బు చేసిన వారికి జీర్ణించుకునే శక్తి తక్కువగా ఉంటుంది కనుక పొట్లకాయను ఆహారంలో భాగంగా తీసుకుంటే అజీర్తి సమస్య రాదు. పొట్ల కాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మనలో ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి. పొట్లకాయలు మన ఆలోచనలను తగ్గించి వెంటనే నిద్రలోకి జారుకునేలా చేస్తాయి.
పొట్లకాయలలో ఉండే పాలీఫినాల్స్ కు మన మెదడులో ఉండే న్యూరో ట్రాన్స్ మీటర్ల పని తీరుని తగ్గించే శక్తి ఉంది. న్యూరో ట్రాన్స్ మీటర్ల పని తీరు తగ్గడం వల్ల ఆలోచనలు తక్కువగా వచ్చి నిద్ర బాగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మానసిక ఆందోళన తగ్గి షుగర్, బీపీ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
వీటిని వండే విధానంలో చాలా మంది తెలియక తప్పు చేస్తుంటారు. పొట్లకాయలోని నీరు పూర్తిగా పోయేలాగా కూర కానీ, వేపుడు కానీ చేయవద్దు. పొట్లకాయలలో 50 శాతం నీరు ఉండేలా 10 నుండి 15 నిమిషాలు మాత్రమే ఉడికించాలి. పొట్లకాయలతో పెరుగు పచ్చడి చేసుకొని తినడం వల్ల శరీరంలో ఉండే వేడి తగ్గుతుంది. అలాగే మలబద్దకం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఇలా పొట్లకాయల వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.