Watermelon Seeds : పుచ్చ‌కాయ విత్త‌నాలు మ‌న‌కు ల‌భించిన వ‌రం.. వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ప‌డేయ‌వ‌ద్దు..!

Watermelon Seeds : వేస‌వికాలంలో స‌హ‌జంగానే చాలా మంది పుచ్చ‌కాయల‌ను తింటుంటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిల్లో ఉండే దాంట్లో 90 శాతం నీరే ఉంటుంది. చ‌ల్ల‌గా వీటిని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే పుచ్చ‌కాయ‌ల్లో ఉండే విత్త‌నాల‌ను చాలా మంది ప‌డేస్తుంటారు. కానీ వీటితోనూ మ‌న‌కు అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే పుచ్చ‌కాయ విత్తనాల‌ను ఎలా తినాలి ? అనే సందేహం చాలా మందికి క‌లుగుతుంటుంది. కానీ వీటిని తేలిగ్గా అలాగే తినేయ‌వ‌చ్చు.

you should definitely eat Watermelon Seeds for these wonderful benefits
Watermelon Seeds

పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. ఏమీ కాదు. ఎలాంటి భ‌యం చెందాల్సిన ప‌నిలేదు. అయితే అలా తిన‌లేమ‌ని అనుకునేవారు ఎండ‌బెట్టి వాటిని వేయించి వాటిపై కాస్త ఉప్పు, మిరియాల పొడి చ‌ల్లి తిన‌వ‌చ్చు. లేదా ఆ విత్తనాల‌ను పొడిగా మార్చి పండ్ల ముక్కల‌పై చ‌ల్లి తిన‌వ‌చ్చు. ఇలా పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను ఏ ర‌కాంగా తీసుకున్నా కూడా అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పుచ్చ‌కాయ విత్త‌నాలు బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో క్యాల‌రీలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అలాగే వీటిని తింటే శ‌రీర మెటాబ‌లిజం పెరుగుతుంది. ఇది కొవ్వు క‌రిగేందుకు స‌హాయం చేస్తుంది. దీని వ‌ల్ల అధిక బ‌రువు సుల‌భంగా త‌గ్గుతారు. క‌నుక పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను రోజూ తినాలి.

2. పుచ్చ‌కాయ విత్త‌నాల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను త‌గ్గిస్తుంది. దీంతో మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ప‌డుకున్న వెంట‌నే గాఢంగా నిద్ర ప‌ట్టేస్తుంది.

3. పుచ్చ‌కాయ విత్త‌నాల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వ్యాధులు రాకుండా చూస్తుంది. ద‌గ్గు, జ‌లుబును త‌గ్గిస్తుంది. ఇక జింక్ పురుషుల్లో వీర్యం అధికంగా త‌యార‌య్యేలా చేస్తుంది. దీంతో సంతాన లోపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

4. ఈ విత్త‌నాల్లో ఐర‌న్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది ర‌క్తం బాగా త‌యార‌య్యేలా చేస్తుంది. దీంతో ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

5. ఈ విత్త‌నాల్లో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తాయి. దీని వ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

6. పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను పొడి చేసి అందులో నీళ్లు క‌లిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. 30 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చాలు.. ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు, క‌ళ్ల కింద ఉండే న‌ల్ల‌ని వ‌ల‌యాలు పోతాయి. అలాగే ఈ పేస్ట్‌ను త‌ల‌కు రాసి గంట సేపు అయ్యాక త‌ల‌స్నానం చేయాలి. దీంతో చుండ్రు, జుట్టురాల‌డం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది.

7. షుగ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారికి ఈ విత్త‌నాలు వ‌రం అనే చెప్ప‌వచ్చు. వీటి పొడిని 1 టీస్పూన్ మోతాదులో భోజ‌నానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. రోజుకు 2 సార్లు ఇలా చేయాలి. నెల రోజుల పాటు రోజూ వాడితే షుగ‌ర్ లెవ‌ల్స్ క‌చ్చితంగా త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

8. ఆస్త‌మా స‌మ‌స్య ఉన్న‌వారు పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను తింటే ఆ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. శ్వాస స‌రిగ్గా ఆడుతుంది. అలాగే నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ కూడా మెరుగ్గా ప‌నిచేస్తుంది. మెద‌డు యాక్టివ్‌గా ఉంటుంది. చురుగ్గా ప‌నిచేస్తారు. ఈ విధంగా పుచ్చ‌కాయ విత్త‌నాల‌తో అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts