Fennel Seeds : తిన్న ఆహారం త్వరగా జీర్ణమవ్వడానికి మనం భోజనం చేసిన తరువాత సోంపు గింజలను తింటూ ఉంటాం. ఈ సోంపు గింజలు మనందరికి తెలిసినవే. వీటిని ఇంగ్లీష్ లో ఫెన్నెల్ సీడ్స్ అని అంటారు. సోంపు గింజలు చక్కటి వాసనను కలిగి ఉంటాయి. వివిధ రకాల వంటల్లో కూడా వీటిని వాడుతూ ఉంటాం. చక్కటి వాసనను, చక్కటి రుచిని కలిగి ఉండే సోంపు గింజలను తినడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుందని మనలో చాలా మందికి తెలిసి ఉండదు. సోంపు గింజల్లో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. షగుర్ వ్యాధితో బాధపడే వారు ఈ సోంపు గింజలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీంతో షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.
ఈ గింజల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో పాటు రాగి, పొటాషియం, జింక్, ఐరన్, క్యాల్షియం, మాంగనీస్, సెలీనియం వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఈ సోంపు గింజలు మనకు ఎల్లవేళలా విరివిరిగా లభిస్తాయి. రోజూ ఉదయం లేదా సాయంత్రం భోజనం చేసిన తరువాత ఒక టీ స్పూన్ సోంపు గింజలను తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ గింజలను తినడం వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు, అవసరం లేని ద్రవాలు బయటకు పోతాయి. దీంతో మలమూత్ర నాళాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ సోంపు గింజల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సోంపు గింజలను నీటిలో వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి.
అధిక బరువుతో బాధపడే వారు ఇలా తయారు చేసుకున్న సోంపు టీ తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. అలాగే అజీర్తి సమస్యతో బాధపడే వారు ఈ సోంపు గింజలను తినడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో మనకు గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. క్యాన్సర్ బారిన పడకుండా చేసే శక్తి కూడా ఈ సోంపు గింజలకు ఉంది. ఈ గింజలను తినడం వల్ల రొమ్ము క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని మరింత మెరుగుపరిచి మనల్ని అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేయడంలో కూడా ఈ సోంపు గింజలు మనకు ఉపయోగపడతాయి.
సోంపు గింజలను తీసుకోవడం వల్ల స్త్రీలల్లో వచ్చే నెలసరి సమస్యలు కూడా తగ్గుతాయి. ఒక గ్రాము సోంపు గింజల్లో 2 గ్రాముల పటిక బెల్లాన్ని, రెండు గ్రాముల బాదం పప్పును వేసి మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని పాలల్లో కలిపి మూడు నెలల పాటు తీసుకోవడం వల్ల కళ్లద్దాలు వాడే పని లేకుండా కంటిచూపు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలను రాత్రి పూట తీసుకోవడం వల్ల ఆస్థమా, దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ గింజలను తినడం వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా నశించి నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది. రాత్రి పూట సోంపు గింజలతో చేసిన టీ ని తాగినా లేదా సోంపు గింజలను తిన్నా కాలేయంలోని మలినాలు తొలగిపోయి కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసే శక్తి సోంపు గింజలకు ఉందని వీటిని తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.