Sprouted Peanuts : మొల‌కెత్తిన ప‌ల్లీల‌ను రోజూ తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Sprouted Peanuts : ప‌ల్లీలు.. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ప‌ల్లీల‌ను మ‌నం విరివిరిగా వంట‌ల్లో వాడుతూ ఉంటాము. వీటిని పొడిగా చేసి కూర‌ల్లో వాడుతూ ఉంటాము. అలాగే చ‌ట్నీల త‌యారీలో కూడా వీటిని ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము. అలాగే ఈ ప‌ల్లీల‌ను మ‌నం వేయించి, ఉడికించి కూడా తీసుకుంటూ ఉంటాము. చాలా మంది ప‌ల్లీల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. ప‌ల్లీల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే ప‌ల్లీల‌ను వేయించి, ఉడికించి తీసుకోవ‌డానికి బ‌దులుగా మొల‌కెత్తించి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ఆరోగ్యప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

మొల‌కెత్తిన ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ర‌క్త‌పోటుతో బాధ‌పడే వారు మొల‌కెత్తిన ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. వీటిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారికి మొల‌కెత్తిన ప‌ల్లీలు చ‌క్క‌టి ఆహార‌మ‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబ‌ర్ బ‌రువు త‌గ్గడంలో ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు మొల‌కెత్తిన ప‌ల్లీల‌ను ఆహారంగా తీసుకోవ‌చ్చు. వీటిని తీసుకోవ‌డం వల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ఎముకల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

Sprouted Peanuts health benefits in telugu
Sprouted Peanuts

అలాగే మొల‌కెత్తిన ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. అజీర్తి, గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మస్య‌లు త‌గ్గుతాయి. అదే విధంగా మొల‌కెత్తిన ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జుట్టు పెరుగుద‌ల‌కు కావ‌ల్సిన పోష‌కాలు ప‌ల్లీల‌ల్లో స‌మృద్దిగా ఉంటాయి. మొల‌కెత్తిన ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్లు బ‌లంగా త‌యార‌వుతాయి. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన‌ పోష‌కాలు ల‌భిస్తాయి. శ‌రీరం బ‌లంగా త‌యార‌వుతుంది. నీర‌సం, అల‌స‌ట‌, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఈ విధంగా మొల‌కెత్తిన ప‌ల్లీలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని వారంలో మూడు నుండి నాలుగు సార్లు తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts