Summer Heat : ఒంట్లో బాగా వేడి చేసి త‌ట్టుకోలేక‌పోతున్నారా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Summer Heat : వేస‌వి కాలంలో ఎండ‌లు మండిపోవ‌డం స‌హ‌జ‌మే. జూన్ నెల మ‌ధ్య వ‌ర‌కు వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే. అప్ప‌టి వ‌ర‌కు వాతావ‌ర‌ణం కాస్త చల్ల‌బ‌డుతుంది క‌నుక అప్ప‌టి వ‌ర‌క‌కు ఎలాగోలా ఎండ‌ల‌ను త‌ట్టుకోవాలి. అయితే కొంద‌రికి ఎండ‌లో తిర‌గ‌కున్నా వేస‌వి కాలంలో వాతావ‌ర‌ణం వ‌ల్ల వేడి చేస్తుంది. ఇక ఎండ‌లో తిరిగే వారికి ఎలాగూ వేడి చేస్తుంది. అయితే వేడి మ‌రీ ఎక్కువ‌గా ఉంటే కొంద‌రు త‌ట్టుకోలేరు. ఇత‌ర అనారోగ్యాల బారిన ప‌డుతుంటారు. మ‌రి అలాంట‌ప్పుడు ఏం చేస్తే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా.

ప్ర‌తి రోజూ ఉద‌యాన్నే నిమ్మ‌ర‌సం లేదా కొబ్బ‌రి నీళ్లను ఒక గ్లాస్ మోతాదులో తాగాలి. వేడి మ‌రీ ఎక్కువ‌గా ఉంటే మ‌ధ్యాహ్నం స‌మ‌యంలోనూ ఇంకో గ్లాస్ తాగ‌వ‌చ్చు. దీంతో వేడి త‌గ్గుతుంది. వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇక ఉద‌యం కొబ్బ‌రినూనె లేదా స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌తో శ‌రీరాన్ని మ‌ర్ద‌నా చేయాలి. అనంత‌రం స్నానం చేయాలి. త‌ర‌చూ ఇలా చేస్తుంటే శ‌ర‌రీంలో అస‌లు వేడి అన్న‌ది ఉండ‌దు.

Summer Heat reducing tips in telugu follow these
Summer Heat

రోజూ తాటి బెల్లం క‌లిపిన నీళ్ల‌ను 2 క‌ప్పుల మోతాదులో తాగుతుండాలి. ఉద‌యం, మ‌ధ్యాహ్నం లేదా ఉద‌యం, సాయంత్రం ఒక క‌ప్పు చొప్పున తాగాలి. దీని వ‌ల్ల కూడా శ‌రీరంలోని వేడి త‌గ్గుతుంది. అలాగే ప్ర‌తి రోజూ ఎర్ర మందార పువ్వుల‌తో త‌యారు చేసి టీ డికాష‌న్‌ను తాగ‌డం వ‌ల్ల కూడా శ‌రీర ఉష్ణోగ్ర‌త త‌గ్గుతుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. కుంకుమ పువ్వు క‌లిపిన పాల‌ను రోజూ రాత్రి భోజ‌నం అనంత‌రం తాగాలి. దీని వ‌ల్ల కూడా వేడిని త‌గ్గించుకోవ‌చ్చు.

సోంపు, జీల‌క‌ర్ర‌, ధ‌నియాల‌ను రాత్రంతా నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఆ నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల కూడా శ‌రీరంలోని వేడి త‌గ్గిపోతుంది. అదేవిధంగా రోజుకు ఒక‌సారి దానిమ్మ గింజ‌ల‌ను ఒక క‌ప్పు మోతాదులో తినాలి, లేదా జ్యూస్ అయితే ఒక గ్లాస్ తాగాలి. దీంతో కూడా వేడి ఇట్టే త‌గ్గుతుంది. ఇక రోజూ రాత్రి మెంతుల‌ను నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆ నీళ్ల‌ను తాగాలి. అలాగే పుల్ల‌ని పండ్లు, బీట్‌రూట్‌, క్యారెట్ ల‌ను వేస‌విలో త‌క్కువగా తీసుకోవాలి. కీర‌దోస‌, పుచ్చ‌కాయ‌, త‌ర్బూజాల‌ను అధికంగా తినాలి, మామిడి పండ్లు వేడి చేస్తాయి. క‌నుక రోజుకు ఒక పండుకు మించ‌కుండా తినాలి. ఇలా ఈ విధంగా చిట్కాల‌ను పాటిస్తే వేడి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Editor

Recent Posts