ఉసిరి.. ఆయుర్వేదంలో దీనికి ప్రముఖ స్థానం కల్పించారు. ఎంతో పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగిస్తున్నారు. అనేక అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉసిరి చక్కగా పనిచేస్తుంది. ఉసిరికాయలను అనేక ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ కాయలు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు వీటిల్లో ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరిగేందుకు, ఇంకా ఇతర అనేక సమస్యలకు ఉసిరి దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
అయితే ఉసిరికాయలతో లివర్‌ను శుభ్రం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరి శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అందులో భాగంగానే లివర్ కూడా శుభ్రంగా మారుతుంది.
* ఉసిరి కాయల జ్యూస్‌ను నిత్యం 2-3 టీస్పూన్ల మోతాదులో పరగడుపునే సేవించాలి. ఇలా చేస్తే లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
* ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 2 టీస్పూన్ల ఉసిరి రసాన్ని కలిపి కూడా తీసుకోవచ్చు.
* నల్ల ఉప్పుతో కలిపి ఉసిరికాయను నేరుగా అలాగే ఉదయాన్నే తినవచ్చు.
* ఎండ బెట్టిన ఉసిరికాయ ముక్కలు మనకు లభిస్తాయి. నిత్యం భోజనం చేశాక 3 పూటలా 2,3 ఉసిరికాయ ముక్కలను నమిలి తినడం వల్ల కూడా లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
* ఎప్పటికప్పుడు తాజాగా ఉసిరికాయలతో ఉసిరికాయ పచ్చడి పెట్టుకుని నిత్యం కొద్దిగా తింటున్నా.. దాంతో ఆరోగ్యం కలుగుతుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. అందులో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోయి శుభ్రంగా మారుతుంది.