Chickpeas : వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉందా ? వీటిని రోజూ తీసుకోండి.. మాంసం కన్నా ఎన్నో రెట్ల శక్తి కూడా లభిస్తుంది..!

Chickpeas : శనగలను వాస్తవానికి చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. వీటిని ఉడకబెట్టి కాస్తంత పోపు వేసి గుగ్గిళ్లలా చేసుకుని తింటే వచ్చే మజాయే వేరు. ప్రస్తుతం జంక్‌ ఫుడ్‌ యుగంలో శనగల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ ఇవి సూపర్‌ ఫుడ్‌ జాబితాకు చెందుతాయి. రోజూ సాయంత్రం సమయంలో శనగలను ఒక కప్పు మోతాదులో ఉడకబెట్టి తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. శనగలను రోజూ తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

take boiled Chickpeas daily one cup for these wonderful benefits

1. శనగలను పొట్టు తీయకుండా కప్పు మోతాదులో ఉదయాన్నే నానబెట్టాలి. వాటిని సాయంత్రం ఉడకబెట్టాలి. వాటిపై కాస్త ఉప్పు చల్లి పోపు వేసి తినాలి. దీంతో అద్భుతమైన రుచిని అందిస్తాయి. పైగా పోషకాలు లభిస్తాయి. శనగల్లో చికెన్‌, మటన్‌ కన్నా ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల వాటి కన్నా శనగలను తింటేనే ఎక్కువ శక్తి లభిస్తుంది. దీంతో నీరసం, నిస్సత్తువ తగ్గిపోతాయి. యాక్టివ్‌గా మారుతారు. చురుగ్గా పనిచేస్తారు. చిన్నారులు ఉత్సాహంగా చదువుకుంటారు. క్రీడల్లోనూ రాణిస్తారు. వ్యాయామం చేసేవారికి, రోజూ శారీరక శ్రమ చేసే వారికి శనగలు ఉత్తమమైన ఆహారం అని చెప్పవచ్చు. ఇవి ఎంతగానో శక్తిని అందిస్తాయి. దీంతో చురుగ్గా పనిచేయవచ్చు.

2. శనగలను ఇలా ఉడకబెట్టి రోజూ తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ పోతుంది. మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

3. శనగలను తినడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునేవారు రోజూ వీటిని తింటే ఫలితం ఉంటుంది.

4. శనగల్లో పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం తదితర మినరల్స్‌ అధికంగా ఉంటాయి. అందువల్ల ఎముకలు దృఢంగా, బలంగా మారుతాయి. విరిగిన ఎముకలు ఉన్నవారు శనగలను రోజూ తింటుంటే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. పాలు తాగలేం అనుకునేవారు కాల్షియం కోసం శనగలను రోజూ తినవచ్చు. దీంతో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఎముకలు దృఢంగా మారుతాయి.

5. శనగలను తినడం వల్ల హైబీపీ తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే వాటిల్లో వారు ఉప్పు చల్లకుండా తినాలి. దీంతో బీపీ కంట్రోల్‌ అవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది.

6. రక్తహీనత సమస్య ఉన్నవారు శనగలను పొట్టుతో సహా ఉడికించి తింటుంటే ఐరన్‌ బాగా లభిస్తుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.

7. శనగలను తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యల నుంచి బయట పడవచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని తింటే ఎంతో మేలు జరుగుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

8. వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నవారు శనగలను రోజూ తింటే మేలు జరుగుతుంది. వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది సంతానం కలిగే అవకాశాలను మెరుగు పరుస్తుంది.

9. శనగల్లో ఉండే ఫైబర్‌ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అజీర్ణం, మలబద్దకం నుంచి బయట పడేస్తుంది. కనుక శనగలను రోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

Admin

Recent Posts