Guava Seeds : జామ‌కాయ‌ల్లో ఉండే విత్త‌నాల‌ను తిన‌కూడ‌దా ? ప్ర‌మాద‌క‌ర‌మా ?

Guava Seeds : జామకాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. జామ‌కాయ‌లు కొద్దిగా ప‌చ్చిగా, దోర‌గా ఉన్న స‌మ‌యంలో తింటే ఎంతో అద్భుత‌మైన రుచిని క‌లిగి ఉంటాయి. పండ్ల క‌న్నా అలా దోర‌గా ఉన్న స‌మ‌యంలోనే వాటిని తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. జామ‌కాయ‌ల‌ను పేదోడి యాపిల్‌గా ప‌రిగ‌ణిస్తారు. అంటే.. యాపిల్ లాంటి పోష‌క విలువ‌లు ఉండ‌డంతోపాటు ధ‌ర కూడా త‌క్కువ‌గా ఉంటాయ‌న్న‌మాట‌. అందుక‌నే వాటిని అలా పిలుస్తారు.

can we eat Guava Seeds is there any harm with them

అయితే జామ‌కాయ‌లు లేదా పండ్లు.. వేటిలో అయినా స‌రే విత్త‌నాలు అధికంగా ఉంటాయి. వాటిని కూడా నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. కానీ కొంద‌రు వాటిని తినేందుకు సందేహిస్తుంటారు. జామ‌కాయ‌లు లేదా పండ్ల‌లో ఉండే విత్తనాల‌ను తిన‌వ‌చ్చా ? వాటితో ఏమైనా ప్ర‌మాదం జ‌రుగుతుందా ? ఆ విత్త‌నాలు హానిక‌ర‌మైన‌వా ? అని ప్ర‌శ్న‌లు వ‌స్తుంటాయి. మ‌రి ఇందుకు నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారంటే..

జామ కాయ విత్త‌నాల్లో అనేక పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి ఒక‌ర‌మైన స‌మ్మేళ‌నాలు. యాంటీ ఆక్సిడెంట్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటాయి. క‌నుక శ‌రీరంలో ఉత్ప‌త్తి అయ్యే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు నిర్మూలిస్తాయి. క‌ణాల‌ను సురక్షితంగా ఉంచుతాయి. క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రాకుండా చూస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.

జామకాయ విత్త‌నాల్లో ఉండే పాలిఫినాల్స్ మ‌నకు ఎన్నో ప్ర‌యోజనాల‌ను అందిస్తాయి. శ‌రీరంలోని క‌ణాల‌ను సుర‌క్షితంగా ఉంచ‌డంతోపాటు వృద్ధాప్య ఛాయ‌ల‌ను ద‌రిచేర‌నీయ‌వు. దీంతో య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. చ‌ర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది.

జామకాయ విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. క‌నుక జామ‌కాయ‌ల్లో ఉండే విత్త‌నాల‌ను క‌చ్చితంగా తినాల్సిందే. అవి పూర్తిగా సుర‌క్షిత‌మే. వాటితో హాని జ‌రుగుతుంద‌ని అన‌డంలో నిజం లేదు. జామ‌కాయ విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది.

జామ‌కాయ విత్త‌నాల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, అసిడిటీ, అజీర్ణం స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డేస్తుంది. మెట‌బాలిజంను పెంచి బ‌రువు త‌గ్గేలా చేస్తుంది. క‌నుక జామ‌కాయ విత్త‌నాల‌ను క‌చ్చితంగా తినాల్సిందే. వీటితో ఎలాంటి హానీ క‌ల‌గదు. ఇవి పూర్తిగా సుర‌క్షిత‌మే.

Share
Admin

Recent Posts