Cardamom : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అధిక బరువు, షుగర్, రక్తపోటు, మొటిముల, జుట్టు రాలడం, శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం , జీర్ణ సమస్యలు ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలే. ఇటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడాలంటే ముందుగా మనం జీవన శైలిని మార్చుకోవాలి. అలాగే మంచి ఆహారపు అలవాట్లను అలవరుచుకోవాలి. వీటితో పాటు మన వంటింట్లో ఉండే ఔషధ గుణాలు కలిగిన మసాలా దినుసులు సరైన పద్దతిలో ఉపయోగించాలి. వీటిని ఉపయోగించి సరైన విధానాన్ని తెలుసుకుని వాడడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
మన అనారోగ్య సమస్యలన్నింటిని దూరం చేసే మసాలా దినుసుల్లో యాలకులు ఒకటి. వీటిని మనం వంటల్లో, తీపి వంటకాల తయారీలో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా యాలకులను విరివిరిగా ఉపయోగిస్తారు. యాలకుల్లో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే వీటిని వాడడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అలాగే వీటిని ఎలా ఉపయోగించాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. యాలకుల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిలో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. యాలకులను ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
యాలకులను ఉపయోగించి మనం నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. రోజూ ఉదయం దంతాలను శుభ్రం చేసుకున్న తరువాత యాలకులను, పుదీనా ఆకులను నోట్లో వేసుకుని నములుతూ చప్పరిస్తూ తినాలి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే యాలకులను ఉపయోగించడం వల్ల మనం గ్యాస్, అజీర్తి, మలబద్దకం, ఎసిడిటి వంటి సమస్యలు తగ్గుతాయి. రోజూ భోజనం చేసిన తరువాత యాలకులను నోట్లో వేసుకుని నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు మన దరి చేరుకుండా ఉంటాయి. అలాగే శరీరంలో వాతం కారణంగా వచ్చే నొప్పులను తగ్గించడంలో కూడా యాలకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వాతం వల్ల నొప్పులతో బాధపడే వారు రోజూ ఉదయం పరగడుపున యాలకులను నమిలి ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి.
అలాగే మొటిమలు, మచ్చలు వంటి సమస్యలతో బాధపడే వారు రోజూ ఉదయం అలాగే రాత్రి భోజనం చేసిన గంట తరువాత రెండు యాలకులను నమిలి తిని వెంటనే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ఈ చిట్కాను పాటించడం వల్ల వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. తలనొప్పిని తగ్గించే గుణం కూడా యాలకులకు ఉంది. తలనొప్పితో బాధపడుతున్నప్పుడు యాలకులను నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి వెంటనే తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే యాలకులను ఉపయోగించడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ ఉదయం పరగడుపున రెండు యాలకులను నమిలి తిని వెంటనే గోరు వెచ్చని నీటిని తాగాలి.
ఇలా చేయడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి మనం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఇలా చేయడం వల్ల మనం అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడవచ్చు. అలాగే యాలకులను పరగడుపున తిని గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అలాగే పిల్లలకు ఇచ్చే పాలల్లో యాలకుల పొడిని కలిపి ఇవ్వడం వల్ల వారిలో కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా యాలకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని ఉపయోగించడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.