హెల్త్ టిప్స్

Curry Leaves For Diabetes : క‌రివేపాకుల‌తో ఇలా చేస్తే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా స‌రే దిగి వ‌స్తుంది..!

Curry Leaves For Diabetes : డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారం కూడా చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కరివేపాకుల‌ను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని సైంటిస్టులు చేప‌ట్టిన‌ పరిశోధ‌నల్లో తేలింది. డయాబెటిస్ ఉన్నవారు జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. కరివేపాకును ప్రతి రోజూ తీసుకుంటే వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పిండి ప‌దార్థాల‌ను గ్లూకోజ్‌ గా మారకుండా నిరోధిస్తాయి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.

కరివేపాకులో విటమిన్లు, బీటా కెరోటిన్, కార్బజోల్, ఆల్కలాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తాయి. కరివేపాకుల‌లో ఫైబర్ సమృద్దిగా ఉండ‌డం వలన శరీరంలో చక్కెరను పీల్చుకునే ప్రక్రియను మందగించడానికి సహాయపడుతుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఉదయం కరివేపాకు కషాయం తయారుచేసుకొని తాగవచ్చు. లేదా కరివేపాకు పొడి తయారుచేసుకొని వేడి నీటిలో కలుపుకొని తాగవచ్చు.

take curry leaves in this way to control diabetes

కరివేపాకును ఏ రూపంలో తీసుకున్నా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాబట్టి డయాబెటిస్‌తో బాధపడేవారు.. డయాబెటిస్ రాకుండా ఉండాలని అనుకునేవారు కరివేపాకుని త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నాలుగైదు క‌రివేపాకుల‌ను నేరుగా అలాగే న‌మిలి మింగాలి. లేదా క‌షాయం, జ్యూస్ తాగ‌వ‌చ్చు. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా షుగ‌ర్ ఉన్న‌వారు క‌రివేపాకుల‌తో లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts