ఇప్పుడంటే మనం మన పెద్దల అలవాట్లను పునికి పుచ్చుకోలేదు కానీ.. నిజంగా వారి అలవాట్లను మనం కూడా పాటిస్తే మన ఆరోగ్యాలు చాలా బాగుండేవి. అవును మరి. ఎందుకంటే.. మన పెద్దలు ఒకప్పుడు అలాంటి తిండి తినేవారు మరి.. వారి జీవన విధానం వల్ల వారు ఇప్పటికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవనం సాగిస్తున్నారు. అయితే మన పెద్దల ఆహారపు అలవాట్లలో ముఖ్యమైంది.. ఉదయాన్నే చద్దన్నం తినడం. అందులో కొద్దిగా పెరుగు వేసుకుని మిరపకాయ, ఉల్లిపాయ పెట్టుకుని మన పెద్దలు తినేవారు. అయితే ఇలా ఉదయాన్నే చద్దన్నం, పెరుగు కలుపుకుని తింటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటంటే…
1. ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు కలుపుకుని తింటే పెరుగులో ఉండే కాల్షియం మన శరీరానికి సరిగ్గా అందుతుంది. దీని వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి.
2. రక్తహీనత సమస్య ఉన్నవారు చద్దన్నంలో పెరుగు కలుపుకుని తింటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
3. ఉదయాన్నే చద్దన్నం, పెరుగు తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
4. ఎండాకాలం ఉదయాన్నే చద్దన్నం, పెరుగు తింటే రోజంతా ఎండలో తిరిగినా శక్తి నశించకుండా ఉంటుంది. ఎండ దెబ్బ తాకకుండా ఉంటుంది. ఉత్సాహంగా, ఉల్లాసంగా పనిచేస్తారు.
5. హైబీపీ, నీరసం, మలబద్దకం సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే చద్దన్నం, పెరుగు కలుపుకుని తింటుంటే ఫలితం ఉంటుంది.
6. అల్సర్లు ఉన్నవారు, జీర్ణాశయం, పేగుల సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే చద్దన్నం, పెరుగు కలుపుకుని తింటే ఆయా అవయవాలకు బలం కలుగుతుంది. వాటిల్లో ఏర్పడే సమస్యలు తొలగిపోతాయి.