తేనె…. దేవతలు తాగే అమృతంతో సమానంగా చెపుతారు. తియ్యటి పంచదార తీపి కంటే తేనె తీపి ఎంతో రుచిగా వుంటుంది. ప్రయోజనాలు పరిశీలిస్తే, వేద కాలంనాటి నుండి తేనెను ఆయుర్వేద మందుల్లో వాడుతూనే వున్నారు. అద్భుతమైన ఔషధ గుణాలే కాక చక్కటి ఆహారంగా కూడా తేనె పనిచేస్తుంది. ప్రయోజనాలు చూడండి – తక్షణ శక్తి – ఒక్క చెంచాడు తేనె తాగితే 50 కేలరీల శక్తి. నిమ్మరసంతో కలిపి తీసుకుంటే ఇంకా మంచి ఆరోగ్యాన్నిస్తుంది.
బరువు తగ్గాలా? షుగర్ సమస్యలా! – పర్వాలేదు. ఇందులో వుండే ఫ్రక్టోస్ చాలా మంచిది ఇది పండ్లలో వుండేటటువంటిది. తీపేకాదు – తియ్యగా వుండటమే కాదు ఇందులో ప్రధాన విటమిన్లు విటమిన్ సి, మినరల్స్, ఐరన్, కాల్షియం వంటివి వుంటాయి. జబ్బులు తగ్గిస్తుంది – దగ్గు, జలుబు వంటివి తగ్గిస్తుంది. నిమ్మరసంలో, తేనె, అల్లం రసం కలిపి తాగటం మన ప్రాచీనులు నేర్పిన దివ్యమైన ఔషధం. కొవ్వు కరిగిస్తుంది – శరీరంలో నిల్వ వున్న కొవ్వు కరుగుతుంది. ఉదయం వేళ ఒక గ్లాసు వేడినీటిలో తెనె వేసుకు తాగితే బరువు తగ్గటం ఖాయం.
జీర్ణక్రియ – తేలికగా ఆహారాన్ని జీర్ణం చేసి మలబద్ధకాన్ని పోగొడుతుంది. అద్భుత సౌందర్య సాధనం – ఆరోగ్య ప్రయోజనాలు అటుంచితే, తేనె చర్మ రక్షణకు ఎంతో ఉపకరిస్తుంది. సౌందర్య సాధనాల తయారీలో దీనిపాత్ర అమోఘం. ఇన్ని ప్రయోజనాలు కల తేనెను ఉపయోగించి ఆరోగ్యాన్ని, అందాన్ని పొందండి.