హెల్త్ టిప్స్

రోజూ ఒక టీస్పూన్ ప‌సుపు.. అంతే.. రోగాలు ఫ‌స‌క్‌..!

మ‌న భార‌తీయులు ప‌సుపును నిత్యం ప‌లు వంట‌కాల్లో వాడుతుంటారు. ప‌సుపు వ‌ల్ల వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే కేవ‌లం రుచికే కాదు, ప‌సుపు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌రిమికొట్ట‌డంలోనూ అద్భుతంగా ప‌నిచేస్తుంది. నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాలు లేదా నీటిలో 1 టీస్పూన్ ప‌సుపు క‌లుపుకుని రోజూ రాత్రి పూట తాగితే .. దాంతో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిత్యం ప‌సుపు క‌లిపిన పాలు లేదా నీటిని తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ క‌ణాలు నాశ‌నం అవుతాయి. పసుపులో క్యాన్స‌ర్‌ను న‌యం చేసే గుణాలు ఉంటాయి.

2. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న వారు పసుపును నిత్యం తీసుకుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ సుల‌భంగా కంట్రోల్ అవుతాయి.

take daily one spoon of turmeric to reduce these health problems

3. నిత్యం ప‌సుపు తీసుకుంటే అధికంగా ఉన్న బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు.

4. హైబీపీ త‌గ్గుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

5. క‌డుపులో అల్స‌ర్లు ఉన్న‌వారు ప‌సుపు, నీరు మిశ్ర‌మం తాగితే ఫ‌లితం ఉంటుంది.

6. జీర్ణ‌క్రియ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కూడా పైన చెప్పిన‌ట్లుగా ప‌సుపు తీసుకుంటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

7. కీళ్ల నొప్పులు, ఇన్‌ఫెక్ష‌న్లు, సైన‌స్ ఉన్న‌వారు నిత్యం ప‌సుపు తీసుకుంటే ఆ స‌మ‌స్య‌ల నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

Admin

Recent Posts