హెల్త్ టిప్స్

Drumstick Leaves Benefits : మునగ ఆకులతో.. ఈ సమస్యలన్నీ దూరం.. కచ్చితంగా వారానికి ఒక్కసారైనా తీసుకోండి..!

Drumstick Leaves Benefits : మునగ ఆరోగ్యానికి చాలా మంచిది. మునగతో ఆరోగ్య ప్రయోజనాలను ఎన్నో పొందవచ్చు. మునగ చెట్టు వేరు నుండి పువ్వు దాకా ప్రతి దానిలో కూడా, పోషకాలు ఉన్నాయి. మునగాకుని ఆహారంలో చేర్చుకుంటే, ఎలాంటి లాభాలను పొందవచ్చు..?, ఏ సమస్యలకి దూరంగా ఉండవచ్చు అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నో జబ్బులని తగ్గించే సంజీవని గా చెప్పబడింది మునగ. ఆయుర్వేదంలో కూడా వాడుతూ ఉంటారు. మునగాకు మీకు దొరికితే, ఖచ్చితంగా తీసుకోండి. వారానికి ఒక్కసారైనా తినండి. అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఒంట్లో ఉండే రోగాలు 90 శాతం వరకు మునగతో తగ్గిపోతాయి. మునగాకు తీసుకుంటే, ఎముకల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. క్యాల్షియం లోపం ఉన్న వాళ్ళు, మునగాకుని తీసుకోవడం వలన ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు వంటి బాధలు ఉండవు. పాలల్లో కంటే 17 రెట్లు క్యాల్షియం మునగలో ఎక్కువ ఉంటుంది.

పెరుగులో కంటే, ఎనిమిది రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఇందులో ఉంటుంది. అరటిపండులో కంటే 15 రెట్లు పొటాషియం ఇందులో ఉంటుంది. ముఖ్యంగా, ఎదిగే పిల్లలకి మునగాకు రసాన్ని పట్టించండి. ఎముకలు దృఢంగా మారుతాయి. ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. మునగాకుతో క్యాన్సర్ సమస్యకి కూడా చెక్ పెట్టవచ్చు. మునగాకులో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. క్యాన్సర్ రాకుండా ఇది చూసుకుంటుంది. అలానే, ఆస్తమా, టీబీ వంటి సమస్యలకి కూడా దూరంగా ఉండవచ్చు.

take drumstick leaves at least weekly once for many benefits

ఒక గ్లాసు నీళ్లలో గుప్పెడు మునగాకుల్ని వేసి మరిగించి, ఈ మిశ్రమాన్ని వడకట్టేసుకుని ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసుకోండి, ఈ నీటిని తాగడం వలన ఆస్తమా, టీబీ తగ్గుతాయి. శరీరంలో ప్రతి అవయవానికి వచ్చే ఇబ్బంది నుండి పరిష్కారాన్ని ఇది చూపిస్తుంది. మునగాకుని తీసుకోవడం వలన, చర్మ సమస్యలకి కూడా చెక్ పెట్టవచ్చు. గజ్జి, తామర, దురద వంటి బాధలు ఉండవు. కొందరు అజీర్తి సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

అజీర్తి, మూత్రవిసర్జనలో మంట, మూత్రపిండాల సమస్యలు లేదంటే మలబద్ధకం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే, ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్, ఒక గ్లాసు మునగాకు రసం కలుపుకొని తీసుకుంటే, ఉపశమనం ఉంటుంది. కందిపప్పుతో పాటుగా మునగాకుల్ని వేసి ఆకుకూర పప్పు వండినట్టు వండుకుని తీసుకోవచ్చు. సలాడ్, సూప్స్ లో కూడా వేసుకోవచ్చు. ఏదైనా కూరలో కానీ సాంబార్లో కానీ వేసుకోవచ్చు. ఇలా, మునగాకుని మీరు ఆహార పదార్థాలలో జోడించి తీసుకుంటే, ఈ లాభాలు అన్నిటినీ పొంది ఆరోగ్యంగా ఉంటారు.

Admin

Recent Posts