Eye Sight : మన జీవన మనుగడకు కంటి చూపు ఎంతో అవసరం. మన జీవన విధానం సరిగ్గా ఉండాలంటే మన కళ్లు ఆరోగ్యంగా ఉండాలి. కానీ ప్రస్తుత కాలంలో కంటి సమస్యలతో బాధపడే వారు రోజు రోజుకూ ఎక్కువవుతున్నారు. కళ్ల నుండి నీరు కారడం, కళ్లు ఎర్రబడడం, కళ్లు పొడి బారడం, కళ్ల మంటలు, కళ్లల్లో దురదలు వంటి వాటిని మనం కంటి సంబంధిత సమస్యలుగా చెప్పుకోవచ్చు. కారణాలు ఏవైనప్పటికీ ఈ సమస్యల కారణంగా కంటి చూపు మందగించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
ఇలాంటి కంటి సంబంధిత సమస్యలన్నింటినీ తగ్గించి కంటి చూపును మెరుగుపరిచే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను పాటించడం వల్ల కంటి సంబంధిత సమస్యలు తగ్గి కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గాను మనం కేవలం గుప్పెడు ఎండుద్రాక్షను ఉపయోగించాల్సి ఉంటుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో ఎండుద్రాక్షను వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఈ ఎండు ద్రాక్షను తినడంతోపాటు ఈ నీటిని కూడా తాగాలి. ఇలా 15 రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల కంటి సంబంధిత సమస్యలు తగ్గి కంటి చూపు మెరుగుపడడాన్ని మనం గమనించవచ్చు.
ఎండు ద్రాక్షలో ఉండే పోషకాలు మన కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ చిట్కాను పాటిస్తూనే ఆకుకూరలను ముఖ్యంగా పాలకూరను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. అదే విధంగా ఆహారంలో ఎక్కువగా చేపలను కూడా తీసుకోవడం వల్ల కూడా కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ విధంగా ఎండు ద్రాక్షను తింటూనే ఈ చిట్కాలను పాటించడం వల్ల కంటి సమస్యలు చాలా త్వరగా తగ్గు ముఖం పడతాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల కంటి ఆరోగ్యంతోపాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.