హెల్త్ టిప్స్

Buttermilk : రోజూ ఒక గ్లాస్‌ మజ్జిగను తాగితే ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా ?

Buttermilk : వేసవికాలంలో సహజంగానే మన శరీరం వేడిగా మారుతుంటుంది. ఇక బయట తిరిగి వస్తే చాలు.. విపరీతమైన వేసవితాపం ఉంటుంది. దీంతో శరీరాన్ని చల్లబరుచుకునేందుకు మనం యత్నిస్తాం. అయితే వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు అత్యుత్తమ ఆహారంగా మనకు అందుబాటులో ఉన్న వాటిల్లో ఒకటి.. మజ్జిగ. మజ్జిగ ఎంతో రుచిగా ఉంటుంది. ఒక గ్లాస్‌ పలుచని మజ్జిగతో కాస్త శొంఠి పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి కలిపి చల్ల చల్లగా తాగితే వచ్చే మజాయే వేరు. ఈ క్రమంలోనే రోజూ అలాంటి మజ్జిగను ఒక గ్లాస్‌ మోతాదులో తాగితే అనేక లాభాలను పొందవచ్చు. మజ్జిగను తాగడం వల్ల మన శరీరానికి చలువ చేస్తుంది. అనేక పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా మన విటమిన్లు ఎ, డి, ఇ, బి లభిస్తాయి. ఇవి మనల్ని అనేక రకాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి.

మజ్జిగను తాగడం వల్ల మనకు కాల్షియం అధిక మోతాదులో లభిస్తుంది. ఇది దంతాలు, ఎముకలను దృఢంగా ఉంచుతుంది. అలాగే అనేక రకాల ఎంజైమ్‌లు, హార్మోన్లను ఉత్పత్తి చేయడంలోనూ మజ్జిగ ఉపయోగపడుతుంది. దీంతో శరీరంలో జీవక్రియలు సక్రమంగా నిర్వర్తించబడతాయి. ఇక కీళ్ల నొప్పులు ఉన్నవారు మజ్జిగను తాగితే కాల్షియం అధికంగా ఉంటుంది కనుక ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరగు పడుతుంది. మానసిక సమస్యలైన ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ తగ్గుతాయి. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీని వల్ల నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. నిద్ర చక్కగా పడుతుంది. రాత్రి పూట మజ్జిగను తాగితే ఈ లాభం పొందవచ్చు.

take one glass of buttermilk daily for many benefits

ఇక పగటిపూట మజ్జిగను తాగితే శరీరం చల్లగా మారుతుంది. మనం కోల్పోయిన ద్రవాలు తిరిగి వస్తాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. డీహైడ్రేషన్‌, ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. ఎండలో తిరిగి వచ్చిన వారు మజ్జిగను తాగితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. మళ్లీ చురుగ్గా పనిచేయగలుగుతారు.

మజ్జిగను తాగడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి. దీంతో యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు దరి చేరవు. మజ్జిగను తాగితే బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ఇక వేసవిలో సహజంగానే చాలా మందికి వేడి కారణంగా అజీర్తి, విరేచనాలు అవుతుంటాయి. అలాంటి వారు మూడు పూటలా మజ్జిగను తాగితే ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఈ విధంగా మజ్జిగను తాగడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు.

Share
Admin

Recent Posts