Betel leaves benefits : ఆధునిక ప్రపంచంలో అందరూ పలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మన జీవనశైలి, ఆహారం ప్రభావితం చేస్తున్నాయి. ఉరుకులు పరుగుల జీవితం వలన చిన్న సమస్యలు పెద్దగా మారేంత వరకూ కూడా మనం వాటిపై దృష్టి సారించడం లేదు. కానీ కొన్ని సమస్యలను మన ఇంట్లోనే పరిష్కారం చూపే ఔషధాలు ఉన్నా.. చాలామంది వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. పెరట్లో ఉన్న మొక్కలతో మనం పలు రోగాలను ఇట్టే నయం చేసుకోవచ్చు. అనేక అనారోగ్య సమస్యలకు ఈ తమలపాకులు సంజీవనీలా ఉపయోగపడతాయి. తమలపాకుల వలన కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.. ఈ తమలపాకులతో కిల్లీలను తయారు చేస్తారు వీటిని పాన్ అంటారు.
దానిలోపల ఏ పదార్థం వేయకుండా సున్నము, వక్కపొడి లాంటివి ఏమీ లేకుండా కేవలం ఆకులు నమిలితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఈ తమలపాకు కాడ ఉంటుంది దాన్ని తొడిమ అంటారు. దాన్ని మీరు కిల్లీ కట్టే వారి దగ్గరికి వెళితే దాన్ని కత్తిరిస్తారు. ఈ తమలపాకు కాడ అనేది మంచిది కాదు. ముఖ్యంగా కాడలో కొన్ని అనర్ధాలు ఉన్నాయి. అందుచేత వారు ఆ కాడను కత్తిరించేస్తారు. బీపీ రక్తపోటు ఉన్నవారు గర్భిణిగా ఉన్నవారు కాడలలో కొన్ని హానికరమైన పదార్థాలు ఉంటాయి. కనుక తప్పనిసరిగా కాడను తొలగించి మాత్రమే తమలపాకును వినియోగించాలి.
తమలపాకు తినడం ద్వారా షుగర్ వ్యాధి, డయాబెటిస్ మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. రక్తంలో షుగర్ ని నియంత్రిస్తుంది. షుగర్ లేని వారు ప్రతిరోజు 2 ఆకులు లేదంటే ఉదయం ఒక ఆకు మధ్యాహ్నం ఒక ఆకు రాత్రిపూట ఒక ఆకు నమలడం ద్వారా దాని నుండి మనం విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు, షుగర్ నియంత్రణ షుగర్ నివారణ రెండిటికి కూడా ఇది పనికి వస్తుంది. మన పూర్వీకులు తమలపాకు తాంబూలంలో జీర్ణశక్తి బాగా ఉందని గ్రహించారు. జీర్ణరసాలు అయినా జటరసము, క్లోమరసము, పైత్య రసము ఉత్పత్తి బాగా పెరిగి జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అజీర్తిని నివారిస్తుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్నవారికి గ్యాస్ నివారణకు మరియు పులుపు పుల్లటి తేనుపులు ఉన్నవారికి కూడా మంచి ఫలితం లభిస్తుంది.