వేసవిలో లభించే అతి మధురమైన పళ్ళు సపోటా. ఇవి తినటం వల్ల రకరకాల అనారోగ్యాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉన్న విటమిన్లు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. ఈ పండు లో కాపర్, నియాసిన్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ లు అధికంగా ఉన్నాయి. దీనిలో ఉండే యాంటి ఇంఫ్ల మేటరి లక్షణాలు గ్యాస్ట్రిక్, కడుపులో సమస్యలను నివారిస్తాయి.
సపోటా జ్యూస్ తాగడం వల్ల అందులోని కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఇంకా ఇది నాడి వ్యవస్థకు విశ్రాంతిని అందించి ఒత్తిడిని తగ్గిస్తుంది. సపోటా జ్యూస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది, శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్ లతో పోరాడే శక్తి ని అందిస్తుంది. సపోటా జ్యూస్ లో ఉండే విటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగు పడటమే కాక లంగ్, సర్వికల్ క్యాన్సర్ లను నివారిస్తుంది.
సపోటా జ్యూస్ తాగడం వల్ల తలలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. జుట్టు బలంగా పెరుగుతుంది. తెల్ల జుట్టుని రాకుండా చేస్తుంది. సపోటా తినడం వల్ల గర్భిణీ మహిళలకు చాలా ప్రయోజనం కలుగుతుంది. పెరిగే పిల్లలకు మంచి బలాన్ని ఇస్తుంది. సపోటా లో ఉండే ప్రక్టోజ్ వల్ల శరీరానికి వెంటనే శక్తిని అందిస్తుంది. సపోటా హానికరమైన ఫ్రీ రాడికల్స్ ని నివారిస్తుంది. క్రమం తప్పకుండా వేసవి కాలం ఈ జ్యూస్ తాగడం వల్ల శరీర వేడిని నియంత్రిస్తుంది.