హెల్త్ టిప్స్

మొల‌కెత్తిన పెస‌ల‌ను రోజూ క‌ప్పు మోతాదులో తిన‌డం మ‌రిచిపోకండి.. అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ప‌ప్పు దినుసుల్లో పెస‌లు కూడా ఒక‌టి. చాలా మంది వీటిని రోజూ తిన‌రు. వీటితో వంట‌లు చేసుకుంటారు. కానీ వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా పెస‌ల‌ను నీటిలో నాన‌బెట్టి త‌రువాత వాటిని మొల‌కెత్తించి తిన‌డం వ‌ల్ల అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే రోజూ ఒక క‌ప్పు మొల‌కెత్తిన పెస‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

take sprouted green gram everyday one cup for health benefits

 

1. అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు రోజూ మొల‌కెత్తిన‌ పెస‌ల‌ను తినాలి. కొలెస్ట్రాల్‌ను త‌గ్గించ‌డంలో పెస‌లు అద్భుతంగా ప‌నిచేస్తాయి. వీటిని రోజూ తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్‌), ట్రై గ్లిజ‌రైడ్ల స్థాయిలు త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

2. అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు మొల‌కెత్తిన పెస‌ల‌ను రోజూ తినాలి. వీటితో బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. పెస‌ల‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శ‌క్తిని అందించ‌డంతోపాటు బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతాయి.

3. డ‌యాబెటిస్ ఉన్న‌వారు మొల‌కెత్తిన పెస‌ల‌ను తింటే వారి షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. మొల‌కెత్తిన పెస‌ల‌ను తింటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ త‌గ్గుతుంది. దీంతో డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది. మొల‌కెత్తిన పెస‌ల‌లో ఉండే ఫైబ‌ర్ డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది.

4. మొల‌కెత్తిన పెస‌ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. గ్యాస్, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌వు.

5. మొల‌కెత్తిన పెస‌ల‌ను తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

పెస‌ల‌ను మొల‌కెత్తించ‌డం చాలా సుల‌భ‌మే అని చెప్ప‌వ‌చ్చు. ముందుగా కొన్ని పెస‌ల‌ను తీసుకుని నీటిలో వాటిని 12 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వాటిని బ‌య‌ట‌కు తీసి శుభ్ర‌మైన వ‌స్త్రంలో వేసి మూట క‌ట్టి ఉంచాలి. దీంతో 2 రోజుల్లోగా మొల‌క‌లు వస్తాయి. వాటిని బ‌య‌ట‌కు తీసి క‌డిగి తిన‌వ‌చ్చు. కొంద‌రు వీటిని ఉడ‌క‌బెట్టి తింటారు. అయితే ఫ్రై మాత్రం చేయ‌కూడ‌దు. చేస్తే వాటిల్లో ఉండే పోష‌క విలువ‌ల‌ను కోల్పోతాము. వీలైనంత వ‌ర‌కు వీటిని నేరుగా తింటేనే మంచిది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Editor

Recent Posts