Thyroid : ఈ 10 ర‌కాల ఫుడ్స్‌ను త‌ర‌చూ తీసుకోండి.. థైరాయిడ్ అన్న స‌మ‌స్యే ఉండ‌దు..!

Thyroid : మ‌న శ‌రీరంలో ఉండే ముఖ్య‌మైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి కూడా ఒక‌టి. థైరాయిడ్ గ్రంథి గొంతు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి మ‌న శరీరంలో ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. హార్మోన్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌డంలో, జీవ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రిగేలా చేయ‌డంలో, శ‌క్తి స్థాయిల‌ను నియంత్రించ‌డం వంటి ముఖ్య‌మైన ప‌నుల‌ను థైరాయిడ్ గ్రంథి నిర్వర్తిస్తుంది. కానీ మ‌న‌లో చాలా మంది థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్నారు. థైరాయిడ్ గ్రంథి స‌రిగ్గా ప‌నిచేయ‌క అనేక ఇబ్బందుల బారిన ప‌డుతున్నారు. నేటి త‌రుణంలో థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌రీ ఎక్కువ‌వుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు అలాగే ఇలాంటి స‌మ‌స్య రాకుండా ఉండాల‌నుకునే వారు థైరాయిడ్ గ్రంథి ప‌నితీరును పెంచే ఆహారాల‌ను తీసుకోవాలి.

ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెరుగుప‌డుతుంది. థైరాయిడ్ సంబంధిత స‌మ‌స్యలు రాకుండా ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి ప‌నితీరును మెరుగుప‌రిచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాయ ధాన్యాలు, చిక్కుళ్లు, బీన్స్ వంటి ఆహారాల్లో అయోడిన్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెరుగుప‌డుతుంది. శ‌రీరానికి కూడా పోష‌కాలు అందుతాయి. అలాగే వంట‌ల్లో అయోడైజ్డ్ ఉప్పును వాడ‌డం వ‌ల్ల కూడా థైరాయిడ్ ప‌నితీరు మెరుగుప‌డుతుంది. సాధార‌ణ ఉప్పుకు బ‌దులుగా అయోడైజ్డ్ ఉప్పును వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అయితే ఈ ఉప్పును కూడా మితంగా వాడాలి. అలాగే జున్ను, పెరుగు, పాల ప‌దార్థాల‌ను వాడ‌డం వ‌ల్ల కూడా థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెరుగుప‌డుతుంది. పాల ప‌దార్థాల్లో అయోడిన్ ఉంటుంది.

take these 10 food for Thyroid
Thyroid

ఇది థైరాయిడ్ గ్రంథి ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అదే విధంగా అయోడిన్ తో పాటు ఇత‌ర ముఖ్య‌మైన పోష‌కాలు కూడా ఉండే గుడ్డును తీసుకోవ‌డం వ‌ల్ల కూడా థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెరుగుప‌డుతుంది. కోడిగుడ్డును ఉడికించి తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే సాల్మ‌న్, ట్యూనా, కాడ్ వంటి చేప‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. చేప‌ల‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. అలాగే బ్లూబెర్రీ, క్రాన్బెర్రీ వంటి వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల థైరాయిడ్ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అయోడిన్ థైరాయిడ్ గ్రంథి ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. అదే విధంగా అవిసె గింజ‌లు, పొద్దు తిరుగుడు గింజ‌లు, బాదం ప‌ప్పులు వంటి వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

అదే విధంగా థైరాయిడ్ గ్రంథి ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో విట‌మిన్ డి కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. శ‌రీరానికి సూర్య‌ర‌శ్మి త‌గ‌ల‌డం, కొవ్వు చేప‌లు, గుడ్డు తీసుకోవ‌డం వ‌ల్ల త‌గినంత విట‌మిన్ డి అందుతుంది. అలాగే ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే తృణ ధాన్యాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల థైరాయిడ్ గ్రంథి స‌క్ర‌మంగా ప‌ని చేస్తుంది. ముఖ్యంగా హైపో థైరాయిడిజం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు తృణ ధాన్యాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ విధంగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెరుగుప‌డుతుంది. థైరాయిడ్ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts