Hemoglobin : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలను వేధించే అనారోగ్య సమస్యలలో ఇది ఒకటి. రక్తహీనత కారణంగా నీరసం, బలహీనత, చర్మం పాలిపోవడం, జుట్టు రాలడం వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. అలాగే శరీర ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కనుక ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఈ సమస్య నుండి బయటపడడానికి వైద్యులు ఎక్కువగా ఐరన్ క్యాప్సుల్స్ ను, సిరప్ ను వాడమని సూచిస్తూ ఉంటారు. ఇలా ఐరన్ మాత్రలను వాడడంతో పాటు ఇప్పుడే పండ్లను రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. రక్తహీనతను తగ్గించే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తహీనతతో బాధపడే వారు ద్రాక్ష పండ్లను తీసుకోవాలి.
ఇందులో విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ద్రాక్ష పండ్లు మనకు అన్ని కాలాల్లో లభిస్తూ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల దీనిలో ఉండే విటమిన్ సి మనం తీసుకునే ఆహారంలో ఉండే ఐరన్ ను గ్రహించడంలో సహాయపడుతుంది. నారింజ పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మొక్కల ఆధారిత ఆహారాల్లో ఉండే నాన్ హీమ్ ఐరన్ ను గ్రహించడంలో సహాయపడుతుంది. ఐరన్ మరియు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాల్లో డ్రై ఆఫ్రికాట్ కూడా ఒకటి. 100 గ్రాముల ఆప్రికాట్ లో 10 మిల్లీ గ్రాముల విటమిన్ సి 0.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. స్ట్రాబెరీలను తీసుకోవడం వల్ల కూడా ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
శరీరం ఐరన్ ను ఎక్కువగా గ్రహించడంలో ఇది మనకు సహాయపడుతుంది. అలాగే పుచ్చకాయలను తీసుకోవడం వల్ల కూడా మనం రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు. ఇక ఐరన్, విటమిన్ బి6 వంటి పోషకాలు కలిగిన అరటిపండ్లను తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఇవి హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో మనకు సహాయపడతాయి. అలాగే శరీరంలో హిమోగ్లోబిన్ ను పెంచడంలో దానిమ్మపండ్లు కూడా మనకు ఎంతో దోహదపడతాయి. వీటిలో ఐరన్ తో పాటు విమటిన్ సి ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల దానిమ్మగింజలల్లో 0.31 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. గర్బిణీ స్త్రీలు, బాలింతలు ఈ పండ్లను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య దరి చేరకుండా ఉంటుంది. ఇక విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా ఉండే పండ్లల్లో ఆపిల్స్ కూడా ఒకటి.
100 గ్రాముల ఆపిల్ పండ్లల్లో 0.1 మిల్లీ గ్రాముల ఐరన్, 840 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటిల్లో కివి పండ్లు కూడా ఒకటి. 100 గ్రాముల కివి పండ్లల్లో 92.7 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ శోషణ పెరుగుతుంది. జామకాయల్లో కూడా ఐరన్, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల జామకాయలల్లో 228.3 మిల్లీ గ్రాముల విటమిన్ సి, 0.3 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఈ విధంగా ఈ పండ్లను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గడంతో పాటు లేని వారికి కూడా రాకుండా ఉంటుందని అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.