అధిక బరువును తగ్గించుకోవడం కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరు సన్నగా ఉన్నవారు బరువు పెరిగేందుకు చూస్తుంటారు. ఎంత ప్రయత్నించినా బరువు పెరగరు. కానీ కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకుంటే దాంతో బరువు త్వరగా పెరగవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
ఖర్జూరాలలో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు ఎ, సి, ఇ, కె, బి2, బి6, నియాసిన్, థయామిన్ వంటి ఎన్నో పోషకాలు వీటలో ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే వీటిలో ప్రొటీన్లు, చక్కెరలు ఉంటాయి. ఇవి శక్తిని అందిస్తాయి. బరువును పెంచేందుకు దోహదపడతాయి. అందువల్ల రోజూ 3 ఖర్జూరాలను రాత్రి పూట తిని పాలు తాగుతుండాలి. దీంతో 20, 30 రోజుల్లోనే చెప్పుకోదగిన మార్పు కనిపిస్తుంది.
రోజూ ఒక టేబుల్ స్పూన్ వెన్నను ఆహారంలో తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వెన్నకు అంతే మోతాదులో చక్కెర కలిపి తీసుకోవాలి. దీన్ని మధ్యాహ్నం భోజనం చేసేందుకు 30 నిమిషాల ముందు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కచ్చితంగా బరువు పెరుగుతారు.
ఒక సాధారణ సైజు మామిడి పండును తిని పాలు తాగాలి. మామిడి పండ్లలో అధిక మోతాదులో పిండి పదార్థాలు, చక్కెరలు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి బరువు పెరిగేందుకు సహకరిస్తాయి. ఒక నెలలోనే తేడాను గమనిస్తారు.
ఈ విధంగా ఆహారాలను తీసుకోవడం వల్ల బరువు సులభంగా పెరగవచ్చు. అయితే బరువు పెరుగుతున్నాం కదా అని అలాగే ఉండరాదు. రోజూ వ్యాయామం చేయాల్సిందే. దీంతో ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరుగుతారు.