Cholesterol : వీటిని రోజూ తీసుకుంటే చాలు.. శ‌రీరంలోని కొలెస్ట్రాల్ ఇట్టే క‌రిగిపోతుంది..

Cholesterol : ప్ర‌స్తుత కాలంలో అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తడానికి ప్రధాన కార‌ణం కొలెస్ట్రాల్. శరీరంలో పేరుకుపోయిన ఈ కొలెస్ట్రాల్ కార‌ణంగా ర‌క్త‌పోటు, గుండె జ‌బ్బులు, అధిక బ‌రువు వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది శ‌రీరంలో అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య నుండి మ‌నం ఎంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌గలిగితే అంత మంచిది. కొలెస్ట్రాల్ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి చాలా మంది మందుల‌ను వాడుతూ ఉంటారు. మందుల‌కు బ‌దులుగా జీవ‌న శైలిని మార్చుకుంటూ కొలెస్ట్రాల్ త‌గ్గించే ఆహారాల‌నుతీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

కొలెస్ట్రాల్ ను త‌గ్గించే ఆహారాలు మ‌న‌కు అందుబాటులో అనేకం ఉన్నాయి. ఈ ఆహారాలు కొలెస్ట్రాల్ ను త‌గ్గిస్తాయ‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా తెలియ‌జేసారు. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌య్యే కొలెస్ట్రాల్ ను త‌గ్గించే ఆహారాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ ను త‌గ్గించే ఆహారాల్లో ఓట్స్ ఒక‌టి. ఇవి మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తూ ఉంటాయి. ఓట్స్ లో క‌రిగే ఫైబ‌ర్ ఉంటుంది. అలాగే వీటికి చెడు కొలెస్ట్రాల్ ( ఎల్ డి ఎల్ ) ను క‌రిగించే గుణం ఉంది. ఓట్స్ ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొవ్వు ప‌ట్టిన చేప‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ర‌క్తంలో కొలెస్ట్రాల్ ను, ట్రై గ్లిజరాయిడ్స్ ను త‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

take these foods daily to reduce cholesterol
Cholesterol

అలాగే కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. బాదం ప‌ప్పు, వాల్ న‌ట్స్ వంటి వాటిని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. అలాగే చిక్కుడు గింజ‌ల‌ను , వంకాయలు, బెండ‌కాయ‌లు వంటి వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. అదే విధంగా తృణ ధాన్యాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. తృణ ధాన్యాలు గుండె ఆరోగ్యాన్ని ర‌క్షించ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాగే వీటిలో విట‌మిన్ బి, ఐర‌న్, కాప‌ర్, జింక్, మెగ్నీషియం వంటి పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. వీటిని ఎక్కువ సేపు నాన‌బెట్టి మ‌న‌కు న‌చ్చిన రీతిలో వండుకుని తిన‌వ‌చ్చు.

అలాగే సోయా గింజ‌ల‌ను వాడ‌డం వ‌ల్ల కూడా మ‌నం చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు అధిక బ‌రువు, ర‌క్త‌పోటు వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల నుండి కూడా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts