హెల్త్ టిప్స్

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలను తినాలి..!

ప్రపంచ వ్యాప్తంగా ఏటా కిడ్నీ సంబంధ వ్యాధులతో ఎంత మంది మృతి చెందుతున్నారో అందరికీ తెలిసిందే. కొన్ని లక్షల మంది పలు రకాల కిడ్నీ వ్యాధులకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. కారణాలు ఏమున్నా నేడు కిడ్నీ వ్యాధులతో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకానొక దశలో కిడ్నీలు పనిచేయకుండా పోవడం, డయాలిసిస్, చివరకు కిడ్నీ మార్పిడి వంటి పలు దశల్లో చాలా మంది అవస్థలు పడుతున్నారు. అయితే కిడ్నీలకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా వైద్యులు సూచించే మందులతోపాటు కింద ఇచ్చిన విధంగా పలు ఆహార పదార్థాలను రోగులు తమ మెనూలో చేర్చుకుంటే దాంతో కిడ్నీలు ఆరోగ్యంగా మారేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు, భవిష్యత్తులో ఎదురయ్యే ప్రాణాంతక పరిస్థితుల నుంచి తప్పించుకోవచ్చు కూడా. ఈ క్రమంలో ఏయే ఆహార పదార్థాలను తింటే కిడ్నీలను సంరక్షించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎరుపు క్యాప్సికం… ఇందులో పొటాషియం తక్కువగా ఉంటుంది. కనుక ఈ క్యాప్సికంను కిడ్నీ రోగులు నిర్భయంగా తినవచ్చు. ఇందులో ఉండే లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. కనుక పలు రకాల కిడ్నీ వ్యాధులు రాకుండా ఉంటాయి. వాటి నుంచి కిడ్నీలకు రక్షణ లభిస్తుంది. విటమిన్ ఎ, సి, బి6, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ వంటివి ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీల ఆరోగ్యం బాగుపడుతుంది. క్యాబేజీ… కిడ్నీ సంబంధ సమస్యలతో సతమతమయ్యే వారు క్యాబేజీని కచ్చితంగా తమ మెనూలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలను సంరక్షిస్తాయి. కిడ్నీ వ్యాధులు రాకుండా చూస్తాయి. డయాలిసిస్ చేయించుకుంటున్న వారు క్యాబేజీని తినడం మంచిది. దీంతో మూత్రాశయ సమస్యలు కూడా ఉండవు. విటమిన్ కె, సి, ఫైబర్ ఉండడం వల్ల మూత్ర సంబంధ సమస్యలు రావు. కిడ్నీల ఆరోగ్యం మెరుగు పడుతుంది.

take these foods if you want your kidneys clean

విష పదార్థాల వల్ల కిడ్నీలకు జరిగే నష్టాన్ని నివారించడంలో కాలిఫ్లవర్‌లోని ఔషధ గుణాలు మెరుగ్గా పనిచేస్తాయి. ఇందులో విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇవి కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. డయాలిసిస్ చేయిచుకుంటున్న వారు నిత్యం కాలిఫ్లవర్‌ను తినడం మంచిది. ఉల్లిపాయలు, వెల్లుల్లి… క్రోమియం ఎక్కువగా ఉండడం వల్ల ఉల్లిపాయలు, వెల్లుల్లిలు కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ప్రోటీన్లు, ఫ్యాట్స్, కార్బొహైడ్రేట్స్ వల్ల కిడ్నీలకు జరిగే నష్టాన్ని క్రోమియం నివారిస్తుంది. ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల అవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. దీంతో కిడ్నీల కణజాలం రక్షింపబడుతుంది. కిడ్నీల వాపులు తగ్గుతాయి. కొలెస్ట్రాల్, క్లాట్స్ వంటివి మాయమవుతాయి. డయాలసిస్ చేయించుకుంటున్న వారు ఈ రెండింటినీ తింటే మంచి ఫలితాలు వస్తాయి.

బెర్రీలు… క్రాన్‌బెర్రీలు, స్ట్రాబెర్రీలను ఎక్కువగా తింటే దాంతో కిడ్నీ సంబంధ సమస్యలు దూరమవుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీల కణజాలాన్ని రక్షిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని అడ్డుకుంటాయి. మూత్ర సమస్యలు దూరమవుతాయి.

Admin

Recent Posts