కిడ్నీలు మీ వంట్లోని రక్తాన్ని శుభ్రపరుస్తాయి. కాని మీరు మాత్రం వాటికి చేసేదేమీ లేదు. కనుక కనీసం వాటి ఆరోగ్యానికవసరమైన తిండి పదార్ధాలు తినండి. వయసు పైబడితే, కిడ్నీ సమస్య మరణం వరకు దారితీయగలదు. ఇప్పటికే కిడ్నీ వ్యాధులున్నవారు దిగువ పేర్కొనే 5 రకాల ఆహారాలను తీసుకుంటే, పరిస్ధితి మెరుగుపడగలదు. రెడ్ బెల్ పెప్పర్ (కాప్సికం) – ఈ యాంటీ ఆక్సిడెంట్ ఆహారం కిడ్నీలకు మంచిది. శరీర ఆరోగ్యానికి చాలా మంచిది కూడాను. కావలసిన పీచు, విటమన్ బి 6, విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్ లైపోసిన్ వంటివి వుంటాయి.
అయితే వీటిని అధికంగా వేడిచేయరాదు. పోషకాలు పోతాయి. పచ్చివిగా తింటే మంచిది. ఈ ఆహారం కిడ్నీని నూటికి నూరు శాతం కాపాడుతుంది. కేబేజి మరియు కాలీఫ్లవర్ – పచ్చనైన ఈ రెండు ఆకు కూరలు కిడ్నీలకు మంచిది. కేబేజిలో విటమిన్ కె , కాలీఫ్లవర్ లో విటమిన్ సి , కాల్షియం వుంటాయి. ఎగ్ వైట్ – గుడ్డులో తెల్లగా వుండే భాగం లో వుండే ఎమినో యాసిడ్లు కిడ్నీకి చాలా మంచిది. తెల్లటి భాగం మాత్రమే తినండి. గుడ్డులోని ఇతర భాగాలు కిడ్నీలకు హాని చేస్తాయి.
బెర్రీలు – రంగు రంగుల బెర్రీలు కిడ్నీలకు చాలా మంచిది. స్ట్రాబెర్రీ, రస్ బెర్రీ, బ్లూ బెర్రీ, క్రాన్ బెర్రీ ఏదైనా సరే మంచివే. యాంటీ ఆక్సిడెంట్లు కల బెర్రీలు కేన్సర్ కూడా మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఆలివ్ నూనె – ఏ ఇతర నూనెలకంటే కూడా ఆలివ్ నూనె, కిడ్నీలకు శారీరక ఆరోగ్యానికి చాలా మంచిదని రుజువయింది. ఆలివ్ నూనె గుండెను కూడా ఆరోగ్యంగా వుంచుతుంది. మంచి ఆహారపుటలవాట్లు ఆచరించాలంటే, కిడ్నీల కవసరమైన ఈ ఆహారాలను కూడా తినండి.