అసలు రాష్ట్ర విభజన జరిగిందే వైఎస్సార్ కుటుంబం వల్ల అని అంటారు. మనకు తెలియని ఎన్నో వాస్తవాలు మన కళ్ళ ముందే జరుగుతుంటాయి. తెలంగాణ వాదం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, అంత వేగంగా అప్పటికప్పుడే విభజన జరగడం వెనక కొన్ని సత్యాలు దాగున్నాయి. అసలు అధికార పీఠంపై మోజుతో cold storage లో పెట్టిన తెలంగాణ వాదాన్ని బయటకు తీసింది వైఎస్సారే. చంద్రబాబు అధికారంలో ఉండగా చిన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టారు.ఆ తర్వాత ఎన్నికలలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ ను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తామంటూ ఊరూరా ప్రచారం చేశారు. తీరా అధికారం చేతికొచ్చాక ఆ విషయం అటకెక్కించారు.
టీఆర్ఎస్ ను హేళన చేసి ఆ పార్టీ ఎమ్మెల్యే లను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్స్ లో చేర్చుకుని,తెలంగాణ ప్రజల మనస్సులను తీవ్రంగా గాయపరిచారు.తిరిగి 2009 ఎన్నికలలో టీడీపీ,టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ లు మహాకూటమి పేరుతో ఎన్నికల బరిలో దిగగా ప్రజారాజ్యం పార్టీ పుణ్యమా అని చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లుగా 157 సీట్లతో అధికారం లోకి వచ్చారు.అసలు ప్రజారాజ్యం, లోక్ సత్తా పార్టీ లు కాంగ్రెస్ ను తిరిగి అధికారం లోకి తెచ్చెందుకే ఏర్పడ్డాయని ఓ వార్త కూడా అప్పట్లో ప్రచారం లో ఉండింది.దానికి తగ్గట్లు గానే తమ పని పూర్తి కాగానే ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైంది,లోక్ సత్తా రాజకీయ పార్టీగా తన ప్రస్థానం చాలించింది.
బొటాబొటి మెజారిటీ తో అధికారం లోకి వచ్చిన వైఎస్ఆర్ తిరిగి ఆపరేషన్ ఆకర్ష్ ను స్టార్ట్ చేశారు.ఇతర పార్టీ ల లోని ఎమ్మెల్యే లను తనవైపు ఆకర్షించడం మొదలెట్టారు.వైఎస్సార్ ను నమ్మి ఆంధ్ర ప్రదేశ్ విషయంలో ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన సోనియా కు క్రమేపీ ఆయనపై విశ్వాసం సన్నగిల్లడం మొదలైంది.అదే సమయంలో ఆంధ్ర,తెలంగాణ ప్రాంతం లోని అధిక శాతం నేతలంతా వైఎస్సార్ వైపు సమీకృతం కావడం మొదలెట్టారు.ఈ విషయంపై అందిన నివేదికలు,సోనియా ఏపీ విషయం లోచేసిన పొరపాటు తెలుసుకునేలా చేశాయి.ఆమె కార్యాచరణకు పూనుకునే లోపే దురదృష్ట వశాత్తూ వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు.సోనియా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునెలోపు జగన్ రూపంలో ఆమెకు మరో సవాల్ ఎదురైంది.తండ్రి పదవి తనకే దక్కాలి, అది తన తండ్రి రెక్కల కష్టమంటు జగన్ సంతకాల సేకరణ మొదలెట్టారు.
ఆంధ్ర,తెలంగాణ భేదం లేకుండా తిరిగి నేతలంతా జగన్ పంచన చేరే ప్రయత్నం మొదలెట్టారు.పరిస్థితి తిరిగి మొదటికొచ్చింది.జగన్ ను పక్కన పెట్టగానే ఆయన వైఎస్సార్సీపీ అంటూ ఓదార్పు యాత్రకు బయల్దేరారు.ఇలా అయితే కష్టమనుకుని,కనీసం తెలంగాణ లో అయినా పార్టీని బతికించుకుందామని సోనియా విభజనకు సిద్ధమయ్యారు. అదే సమయంలో కెసిఆర్ తెలంగాణ రాష్ట్రమిస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానంటూ ముందుకొచ్చారు.ఆ విధంగా తెలంగాణ లో కెసిఆర్ సహాయంతోను ,ఆంధ్ర లో చిరంజీవి సహాయంతో అధికారం నిలబెట్టుకోవచ్చుననే అశతో సోనియా ఏపీ విభజనకు పాల్పడ్డారు.తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచింది.పార్టీని విలీనం చేస్తానన్న కెసిఆర్ మాటతప్పి తానే అధికార పీఠంపై కూర్చున్నారు.
అప్పటికే అలసి పోయిన చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారు .తమ ఆకాంక్షలకు భిన్నంగా ఏపీని అడ్డగోలుగా విభజించిన సోనియాకు ఆంధ్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి చంద్రబాబు కు పట్టం కట్టారు. వైఎస్సార్ బ్రతికుండగానే తన చేత వైఎస్సార్సీపీ ని రిజిస్టర్ చేయించారని కడప జిల్లా కు చెందిన అన్న వైఎస్సార్సీపీ వ్యవస్థాపకుడు మహబూబ్ భాషా చెప్పిన మాటల్లోని మతలబెంటో తెలిసిన వారికి,రాష్ట్ర విభజనకు అదే ప్రధాన కారణమని తెలియడానికి పెద్ద తెలివి తేటలేం అక్కరలేదు.