Tea And Coffee : రోజూ టీ, కాఫీల‌కు బ‌దులుగా ఈ ఆరోగ్య‌క‌ర‌మైన డ్రింక్స్‌ను తాగండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Tea And Coffee : మ‌న‌లో చాలా మంది కాఫీని ఇష్టంగా తాగుతూ ఉంటారు. కాఫీ తాగ‌డం వ‌ల్ల మాన‌సిక ఆందోళ‌న త‌గ్గుతుంది. మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది. శ‌రీరానికి కొత్త శ‌క్తి ల‌భించిన‌ట్టుగా ఉంటుంది. రోజులో 3 నుండి 4 సార్లు కాఫీ తాగే వారు కూడా ఉన్నారు. అయితే ఇలా త‌రుచూ కాఫీ తాగ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వస్తుంది. కాఫీ కూడా మ‌న శ‌రీరానికి ఒక వ్య‌స‌నంలా త‌యార‌వుతుంది. కాఫీ తాగ‌కుండా ఉండ‌లేని స్థితికి చేరుకుంటాము. క‌నుక కాఫీ తాగ‌డాన్ని త‌గ్గించుకోవాలి. కాఫీకి బ‌దులుగా ఇత‌ర పానీయాల‌ను, హెర్బ‌ల్ టీలను తీసుకోవాలి. కాఫీకి ప్ర‌త్యామ్నాయంగా వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. కాఫీకి ప్ర‌త్యామ్నాయంగా తీసుకోద‌గిన ఇత‌ర పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాఫీకి బ‌దులుగా మ‌నం గ్రీన్ టీని తీసుకోవ‌చ్చు.

గ్రీన్ టీని తీసుకోవ‌డం వ‌ల్ల జీవ‌క్రియ మెరుగుప‌డుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే చ‌మోమిలే, పిప్ప‌ర్ మెంట్, మందార వంటి వాటితో టీని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గుతుంది. ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. కాఫీకి బ‌దులుగా వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే పొడి గ్రీన్ టీ ఆకుల‌తో త‌యారుచేసిన మాచాలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. ఇక కాఫీకి బ‌దులుగా ప‌సుపు, అల్లాన్ని పాల‌ల్లో క‌లిపి ప‌సుపు లాట్ ను త‌యారు చేస్తారు. ఇది చాలా సువాస‌న భ‌రితంగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది.

take these healthy drinks daily instead of tea and coffee
Tea And Coffee

బ్లాక్ టీ, దాల్చిన చెక్క‌, యాల‌కులు, అల్లం వంటి సుగంధ ద్ర‌వ్యాలు క‌లిపి చేసే టీని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జీర్ణ‌క్రియ వేగంగా ప‌ని చేస్తుంది. అలాగే మ‌నం కాఫీకి బ‌దులుగా కొబ్బ‌రి నీటిని కూడా తీసుకోవ‌చ్చు. రిఫ్రెష్ అవ్వాల‌నుకునే వారు కొబ్బ‌రి నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. కొబ్బ‌రి నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. వీటితో పాటు బ‌చ్చ‌లికూర‌, క్యారెట్, పుదీనా, కొత్తిమీర వంటి వాటితో జ్యూస్ కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ అందుతాయి. అలాగే పండ్లు, కూర‌గాయ‌లు, పెరుగు, స‌బ్జా గింజ‌లు, చియా విత్త‌నాలు క‌లిపి స్మూతీల‌ను కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

అలాగే మ‌నం కాఫీకి బ‌దులుగా నిమ్మ‌కాయ నీటిని కూడా తీసుకోవ‌చ్చు. గోరు వెచ్చ‌నినీటిలో నిమ్మ‌ర‌సం, తేనె క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణశ‌క్తి మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అదే విధంగా ప్రోబ‌యోటిక్స్ తో కూడిన పులియ‌బెట్టిన టీ కొంబుచా కూడా మ‌న‌కు ల‌భిస్తుంది. ఈ టీని తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. ఈ టీని తీసుకోవ‌డం వ‌ల్ల సువాసన‌, రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ విధంగా కాఫీకి బ‌దులుగా ఈ పానీయాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నకు రిఫ్రెష్ గా ఉండ‌డంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts