Energy : రోజంతా అలసి పోకుండా చురుగ్గా.. ఉత్సాహంగా.. ఉండాలంటే.. వీటిని తీసుకోండి..!

Energy : ప్రస్తుత తరుణంలో చాలా మంది రోజంతా ఉరుకుల పరుగుల బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. దీని వల్ల శక్తి త్వరగా నశిస్తోంది. కొందరు ఉదయం నిద్రలేస్తూనే నీరసంగా, శక్తి లేనట్లు ఉందని చెబుతుంటారు. ఇక అలాంటి వారు రోజంతా ఉత్సాహంగా ఉండలేరు. చురుగ్గా పనిచేయలేరు. ఇలా చాలా మంది శక్తి లేకుండా బలహీనంగా మారి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి బాగా లభిస్తుంది. దీంతో నీరసం, నిస్సత్తువ తగ్గిపోతాయి. యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. రోజంతా పనిచేసినా అలసట రాదు. మరి అందుకు ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

take these healthy foods to keep your Energy levels high all the day
Energy

1. రోజూ రాత్రి పూట గుప్పెడు ఖర్జూరాలను లేదా వాల్‌ నట్స్‌, బాదంపప్పు, కిస్‌మిస్‌, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌, నట్స్‌ను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవాలి. ఇవి శరీరానికి శక్తిని, పోషకాలను అందజేస్తాయి. దీంతో రోజంతా చురుగ్గా ఉంటారు. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి.

2. రాత్రి పూట నాలుగు లేదా ఐదు అంజీర్‌ పండ్లను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తీసుకున్నా చాలు.. శరీరానికి శక్తి బాగా లభిస్తుంది. ఇవి మెదడును యాక్టివ్‌గా ఉంచుతాయి. కనుక రోజంతా చురుగ్గా ఉంటారు. నీరసం అస్సలు రాదు. యాక్టివ్‌గా పనిచేస్తారు.

3. ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక కోడిగుడ్డు ఉండేలా చూసుకున్నా చాలు.. శరీరానికి శక్తి బాగా అందుతుంది. గుడ్డులో ఉండే ప్రోటీన్లు మనకు బలాన్ని ఇస్తాయి. దీంతో అలసట లేకుండా చురుగ్గా పనిచేస్తారు.

4. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ అనంతరం ఒక కప్పు గ్రీన్‌ టీని తాగాలి. ఇది కూడా మనల్ని యాక్టివ్‌గా ఉంచుతుంది. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.

5. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో రాగి జావను తాగడం వల్ల కూడా శరీరానికి శక్తి బాగా లభిస్తుంది. దీంతోనూ అలసట లేకుండా చురుగ్గా పనిచేయవచ్చు. పైగా ఈ జావను తాగితే శరీరంలోని వేడి మొత్తం పోతుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు.

6. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ అనంతరం పండ్ల రసాలు లేదా కూరగాయల రసాలను తాగినా శరీరం చురుగ్గా ఉంటుంది. అలసట అనేది ఉండదు. శక్తి ఉన్నట్లు ఫీలవుతారు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

Admin

Recent Posts