హెల్త్ టిప్స్

Tea And Coffee : ఉద‌యాన్నే టీ, కాఫీల‌కు బ‌దులుగా వీటిని తాగండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Tea And Coffee : చాలామంది ఉదయం లేచిన వెంటనే టీ, కాఫీల‌ని తీసుకుంటూ ఉంటారు. టీ, కాఫీ కంటే కూడా ఆరోగ్యానికి మేలు చేసే వాటిని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే రోజూ ఉదయం టీ, కాఫీ కాకుండా వీటిని తీసుకోండి. వీటిలో ఏ ఒక్కటి తీసుకున్నా కూడా ఆరోగ్యం బాగుంటుంది. చాలా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.

మరి ఉదయం పూట టీ, కాఫీ మానేసి ఏం తీసుకోవాలి.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర లేవగానే చాలా మంది టీ, కాఫీ తీసుకుంటూ ఉంటారు. ఉదయం నిద్ర లేచిన తర్వాత నుండి అల్పాహారం దాకా ఒకటి కంటే ఎక్కువ సార్లు టీ, కాఫీలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా ఈ పానీయాలను తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది.

take these instead of Tea And Coffee in the morning

ఉదయం లేచాక పసుపు, మిరియాలతో టీ చేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. రెండు స్పూన్ల వరకు పసుపు తీసుకొని అందులో మిరియాలు కలిపి గోరువెచ్చని నీటితో తీసుకుంటే జీవక్రియ పెరుగుతుంది. శరీరంలో అదనపు కొవ్వు కరిగిపోతుంది. జీలకర్ర, వాము కలిపి తీసుకుంటే కూడా చక్కటి ప్రయోజనం ఉంటుంది. రెండు కప్పుల‌ దాకా నీళ్లు తీసుకుని చిటికెడు జీలకర్ర, వాము వేసి మరిగించుకోండి.

సగం అయిన తర్వాత వడపోసి తీసుకోండి. దీంతో జీవక్రియని వేగవంతం చేయొచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఉదయం పూట లేవగానే ఖాళీ కడుపుతో గ్లాసు గోరు వెచ్చని నీటిని తీసుకోండి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. జీవక్రియల‌ను వేగవంతం చేసుకోవచ్చు. వేడి నీటిలో నిమ్మరసం వేసుకొని కొద్దిగా తేనె కూడా వేసుకొని ఉదయాన్నే తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. చాలామంది ఇలా తీసుకుంటూ ఉంటారు. అయితే ఉదయం పూట టీ కాఫీలు తీసుకోకుండా ఉండలేము అని అనుకునేవారు టీ, కాఫీల‌ని తీసుకునే ముందు నానబెట్టిన బాదం కానీ గుమ్మడి గింజల్ని కానీ తీసుకోండి. దీంతో ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts