సీజన్లు మారేకొద్దీ సహజంగానే మన శరీరంపై సూక్ష్మ క్రిములు దాడి చేస్తుంటాయి. అనేక రకాల వ్యాధులను కలగ జేస్తుంటాయి. కొన్ని వ్యాధులు బాక్టీరియాల వల్ల వస్తే, కొన్ని వైరస్‌ల వల్ల వస్తాయి. అందువల్ల ఈ రెండింటినీ సంహరించేలా ఉండే పదార్థాలను మనం రోజూ తీసుకోవాలి. దీంతో శరీరంలో ఎప్పటికప్పుడు చేరే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. అనారోగ్యాలు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడవచ్చు. మరి అందుకు ఏయే పదార్థాలను రోజూ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. తులసిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల రెండు రకాల సూక్ష్మ జీవులను నాశనం చేయడంలో తులసి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. రోజూ పరగడుపునే 10-15 తులసి ఆకులను నమిలి మింగుతుండాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి.
2. సూక్ష్మ జీవులను సమర్థవంతంగా ఎదుర్కొనే లక్షణాలు పుట్టగొడుగుల్లో ఉంటాయి. వీటితో రుచికరమైన సూప్‌లు తయారు చేసుకుని తాగవచ్చు. కొందరు వీటితో కూరలు కూడా వండుతారు. ఎలా తిన్నా పుట్ట గొడుగులతో ప్రయోజనాలే కలుగుతాయి. పుట్ట గొడుగులతో మిరియాలు, కొత్తిమీర, ధనియాలు కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రావు.
3. గ్రీన్ టీలో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పాలిఫినాల్స్ అనే సమ్మేళనాలు సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. అందువల్ల రోజూ గ్రీన్ టీ ని తాగితే మంచిది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
4. రోజూ పెరుగు తినాలి. దీంతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది.
5. శొంఠిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని రోజూ తీసుకుంటే మంచిది. ఇది జ్వరాన్ని తగ్గిస్తుంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన శ్లేష్మం కరుగుతుంది. పాలల్లో శొంఠి కలుపుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది.
6. శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను అంతం చేసే శక్తి దాల్చిన చెక్కకు ఉంటుంది. దీంతో కషాయం చేసుకుని తాగవచ్చు. లేదా పొడి రూపంలోనూ తీసుకోవచ్చు. దీని వల్ల శరీరంలో చేరే బాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. జ్వరం తగ్గుతుంది.
7. పసుపులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల రోజూ పసుపును తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరగడమే కాదు, ఇన్‌ఫెక్షన్లు రావు. అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. రాత్రి నిద్రించే ముందు గ్లాస్ పాలలో పసుపు కలుపుకుని తాగితే మంచిది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365