హెల్త్ టిప్స్

Weight Loss : ఖాళీ కడుపుతో వీటిని రోజూ తీసుకుంటే.. సులభంగా బరువు తగ్గవ‌చ్చు..!

Weight Loss : ఈరోజుల్లో చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువమంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గాలని మీరు కూడా ప్రయత్నం చేస్తున్నారా..? అయితే ఇలా చేయండి. ఇలా చేయడం వలన సులభంగా బరువు తగ్గొచ్చు. ఖాళీ కడుపుతో వీటిని తీసుకున్నట్లయితే ఈజీగా బరువు తగ్గవ‌చ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఖాళీ కడుపుతో ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకుని బరువు తగ్గవ‌చ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఖాళీ కడుపుతో బొప్పాయి పండ్లు తీసుకుంటే బరువు తగ్గొచ్చు. బరువు తగ్గడానికి బొప్పాయి బాగా హెల్ప్ చేస్తుంది. ఈ పండులో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఖాళీ కడుపుతో బొప్పాయిని తీసుకుంటే పొట్ట నిండిపోతుంది. జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఖాళీ కడుపుతో సలాడ్స్ తీసుకోండి. ఆకుపచ్చ కూరగాయలతో మీరు రోజుని మొదలుపెట్టండి.

take these on empty stomach for weight loss

ఖాళీ కడుపుతో మీరు సలాడ్స్ ని తీసుకుంటే బరువు తగ్గొచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూరగాయలను, పండ్లని రోజూ ఉదయం పూట తీసుకుంటూ ఉండండి. కూరగాయల రసం ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే శరీరం శుభ్రం అయిపోతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఏదైనా కూరగాయల రసాన్ని ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. ఖాళీ కడుపుతో ఆపిల్ ని కూడా తీసుకుంటూ ఉండండి.

ఆపిల్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆపిల్ లో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం కూడా తీసుకోండి. నానబెట్టిన బాదం తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఖాళీ కడుపుతో గోధుమ గడ్డిని కూడా తీసుకోవచ్చు. ఇందులో ఐరన్, మెగ్నీషియంతోపాటు ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి. ఖాళీ కడుపుతో గోధుమ గడ్డిని తీసుకుంటే ఆకలి కూడా వెయ్యదు. గుడ్లు, మొక్కజొన్న, బ్లూ బెర్రీస్, పుచ్చకాయ, గ్రీన్ టీ, గోధుమ వంటి ఆహార పదార్థాలను మీరు ఖాళీ కడుపుతో తీసుకున్నట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది. సులభంగా బరువు తగ్గొచ్చు. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి.

Share
Admin

Recent Posts