హెల్త్ టిప్స్

Turmeric : రోజూ చిటికెడు ప‌సుపు చాలు.. ఎన్నో వ్యాధులు న‌యం అవుతాయి..!

Turmeric : ఆరోగ్యానికి పసుపు చాలా మేలు చేస్తుంది. పసుపుని మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము. పసుపుతో చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య ఆరోగ్యంపై దృష్టి బాగా పెట్టారు. అందుకని ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. పసుపుతో చాలా ప్రయోజనాలు ఉంటాయి. పసుపులో యాంటీ బయోటెక్ లక్షణాలు ఉంటాయి. శ్వాస కోశ సమస్యలతో బాధపడే వాళ్ళకి పసుపు చాలా మేలు చేస్తుంది.

అలాగే క్యాన్సర్ సమస్యతో బాధపడే వాళ్ళకి కూడా పసుపు చాలా మేలు చేస్తుంది. ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు పసుపుని తీసుకోవడం మంచిది. ఎన్నో రకాల వ్యాధుల్ని ఎదుర్కొనే దివ్య ఔషధం పసుపు. పసుపుతో కీళ్ల నొప్పులు కూడా దూరం అవుతాయి. జాయింట్లు పట్టేసినట్లు ఉండకుండా ఫ్రీగా ఉంటుంది. శరీరంలో వాపు, మంట వంటివి కూడా పసుపుతో తొలగించొచ్చు. నల్ల మిరియాలు, పసుపు కలిపి తీసుకుంటే చక్కటి ప్రయోజనం ఉంటుంది.

take daily a pinch of turmeric for many wonderful health benefits

పసుపుని తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. రోజూ చిటికెడు పసుపుని తీసుకుంటే కొలెస్ట్రాల్ బాధ ఉండదు. ఆల్జీమర్స్ లాంటి మెదడు సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళు పసుపుని రోజూ తీసుకోవడం వలన చక్కటి ప్రయోజనం ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు పసుపుని తీసుకోవడం వలన మంచి ఔషధంలా పనిచేస్తుంది.

కీమో థెరపీ చికిత్స తీసుకున్న వాళ్లకు కూడా పసుపు చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది. క్యాన్సర్, ట్యూమర్ సెల్స్ పెరగకుండా పసుపు నిరోధిస్తుంది. ఇలా పసుపుతో అనేక లాభాలని పొందవచ్చు. పసుపుతో చాలా సమస్యలకి చెక్ పెట్టొచ్చు. కాబట్టి పసుపుని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. రాత్రిపూట పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.

Share
Admin

Recent Posts