Fat : అధిక బరువు, శరీరంలోని కొవ్వును కరిగించుకునేందుకు అనేక మంది నానా ఇబ్బందులు పడుతుంటారు. అందుకు గాను రోజూ డైట్‌ను పాటించడం.. వ్యాయామం చేయడం.. చేస్తుంటారు. అయితే కొన్నిరకాల ఆహారాలను తీసుకోవడం వల్ల అధిక బరువు సులభంగా తగ్గుతారు. వాటి ద్వారా శరీర మెటబాలిజం పెరిగి కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
చాలా మంది సూప్‌లను పెద్దగా పట్టించుకోరు. కానీ అవి బరువును తగ్గించేందుకు అద్భుంగా పనిచేస్తాయి. వివిధ రకాల పదార్థాలతో సూప్‌లను తయారు చేసుకుని తాగాలి. దీంతో శరీరంలోని కొవ్వును కరిగించుకోవచ్చు. ఇందుకు పెద్దగా కష్టపడాల్సిన పని కూడా ఉండదు.
టమాటా సూప్‌ను తయారు చేసుకుని రోజూ తాగవచ్చు. దీన్ని రాత్రి భోజనానికి ముందు తాగితే మంచిది. టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు.. అధిక బరువును తగ్గించేందుకు సహాయం చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక రోజూ టమాటా సూప్‌ను తాగాలి.
క్యాబేజీ అంటే చాలా మందికి నచ్చదు. కానీ అందులో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించేందుకు సహాయ పడతాయి. జీర్ణ సమస్యలను, వాపులను తగ్గిస్తాయి. బీపీని నియంత్రణలో ఉంచుతాయి. కనుక క్యాబేజీ సూప్‌ను కూడా రోజూ తాగవచ్చు. అయితే దీన్ని మధ్యాహ్నం సమయంలో తాగితే మంచిది.
ఉదయాన్నే మన శరీరం ఉపవాస దశలో ఉంటుంది. కనుక శరీరానికి శక్తి ఎక్కువగా కావాలి. అందుకు గాను చికెన్ సూప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు చికెన్ సూప్ తయారు చేసుకుని తాగితే శక్తి లభిస్తుంది. దీంతో రోజు మొత్తం చురుగ్గా పనిచేస్తారు. యాక్టివ్‌గా ఉంటారు. అలాగే మెటబాలిజం పెరిగి శరీరంలో ఉండే కొవ్వు కూడా కరుగుతుంది.
పాలకూరను చాలా మంది తరచూ తింటుంటారు. ఇందులో కాల్షియం, విటమిన్లు కె, డి ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. రక్తం ఎక్కువగా తయారయ్యేలా చేస్తాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. మెటబాలిజంను పెంచి కొవ్వును కరిగిస్తాయి. కనుక పాలకూర సూప్‌ను రోజూ తాగాలి. దీన్ని కూడా ఉదయం తాగితే మంచిది. శాకాహార ప్రియులకు పాలకూర సూప్ ఉత్తమమైన ఆహారం అని చెప్పవచ్చు.